HomeCinemaMeenakshii Chaudhary: రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి.. ఫొటో గ్యాలరీ

Meenakshii Chaudhary: రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి.. ఫొటో గ్యాలరీ

Meenakshii Chaudhary: ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి (Meenakshii Chaudhary) కెరీర్ జెట్ స్పీడుతో దూసుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటోంది. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన మార్క్ సంపాదించుకునేందుకు అమ్మడు కష్టపడుతోంది.

ఇప్పటికే ఈ బ్యూటీ తెలుగులో నటించిన ‘గుంటూరు కారం, సింగపూర్‌ సెలూన్, ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ మూవీస్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. మీనాక్షి నటించిన ఇతర చిత్రాలు ‘లక్కీ భాస్కర్, మెకానిక్‌ రాకీ, మట్కా’ కూడా వచ్చే సంవత్సరం లోపు విడుదలకు రెడీ అవుతున్నాయి.

మరోవైపు తాను హీరోయిన్‌గా కమిటైన మూవీల షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చాయట. ఈ నేపథ్యంలో మీనాక్షి చౌదరి కొత్త సినిమాలు సైన్‌ చేసేందుకు సిద్ధమవుతోందట. ఈ క్రమంలోనే అనేక కథలను ఈ ముద్దుగుమ్మ వింటున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు చెప్పిన కథ మీనాక్షి వినిందట. కథ అమ్మడికి బాగా నచ్చిందని టాక్. శింబు హీరోగా నటించనున్న ఆ మూవీలో హీరోయిన్‌గా నటించేందుకు మీనాక్షి సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కోలీవుడ్ లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

అలాగే మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా నటించి ‘విశ్వంభర’లో కూడా మీనాక్షి చౌదరి ఓ మంచి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ పై భిన్నాభిప్రాయాలు కూడా వచ్చాయి.

ఇక మీనాక్షి లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొంది. లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) చిత్రం ఈనెల 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీగా ఉంది. అందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా రెడ్ డ్రెస్ లో హాట్ పోజులిచ్చింది మీనాక్షి చౌదరి. ఈ ఫొటోలను తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

ఇవీ చదవండి: Meena: ఆ నిర్ణయం అభినందనీయం: నటి మీనా
Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి.. రెడ్‌ డ్రెస్‌లో ఘాటు పోజులు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు