IND vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు కూడా కివీస్ ఎగరేసుకుపోయింది. దీంతో 2-0తో న్యూజిలాండ్ జట్టు 12 ఏళ్ల తర్వాత భారత్ లో టెస్టు సిరీస్ ను నెగ్గినట్లయ్యింది. పూణేలో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ చారిత్రక విజయాన్ని అందుకుంది. టీమిండియా (IND vs NZ) 4331 రోజుల రికార్డు పరంపర ముగిసింది.
సొంతగడ్డపై వరుస టెస్టు సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న భారత్ కు ఇది గట్టి దెబ్బే. (Team India) కివీస్ ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు సాధించిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత ఘోర పరాజయాన్ని చూసింది. రెండో టెస్టులో కివీస్ 113 పరుగుల తేడాతో ఘన విక్టరీ సాధించింది. పర్యటక జట్లను స్పిన్ ఆయుధంతోనే దెబ్బ కొట్టే టీమ్‌ఇండియా.. ఈసారి మాత్రం అదే స్ట్రాటజీకి కుదేలైంది.
ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని ఇటీవల ఇక్కడి పిచ్‌లను పేస్‌కు అనుకూలంగా మార్చుకుంది భారతజట్టు. బెంగళూరులో న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో కూడా ఈ ప్రయోగం తిప్పికొట్టి ఓటమి పాలైన టీమిండియా.. పుణె టెస్టులో మళ్లీ దాన్నే అనుసరించి బోల్తా కొట్టింది. కివీస్ చేతిలో షాక్ తప్పలేదు. కివీస్‌ను స్పిన్‌తో చుట్టేయాలని ప్రణాళిక వేసినా ప్రత్యర్థి విసిరిన అదే అస్త్రం ముందు నిలవలేకపోయింది. టీమిండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ ఒక్కడే రాణించాడు. మిగతా అందరూ స్పిన్ ధాటికి నిలవలేకపోయారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 13 వికెట్లు తీసుకోవడం విశేషం. మరో ఇద్దరు స్పిన్నర్లు గ్లెన్ ఫిలిప్స్ 3, అజాబ్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నారు.
మిచెల్ సాంట్‌నర్ భీకర స్పెల్‌తో న్యూజిలాండ్ విజయం నల్లేరు మీద నడక అయ్యింది. 359 పరుగుల ఛేదనలో, భారత్ 8 పరుగులకే తమ కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. అయితే యశస్వి జైస్వాల్ మరియు శుభ్‌మన్ గిల్ భాగస్వామ్యం వారిని తిరిగి ఆటలోకి తీసుకువచ్చింది. అయినప్పటికీ, సాంట్నర్ క్రమం తప్పకుండా స్ట్రైకింగ్ చేయడంతో భారత్ 245 పరుగులకు ఆలౌటైంది. మొత్తంగా డబ్ల్యూటీసీలో భారత్ అవకాశాలు క్లిష్టతరంగా మారాయని చెప్పక తప్పదు. ఇకపై ప్రతి మ్యాచ్ గెలిస్తేనే చాన్స్ ఉంటుంది.
ఇవీ చదవండి: IND vs NZ: టీమిండియా మరోసారి వైఫల్యం.. తిరుగులేని ఆధిక్యంలో కివీస్
IND vs NZ: టీమిండియాకు ఏమైంది? మరీ 46 పరుగులకే ఆలౌటా?
Ind Vs NZ: ఆ టీమ్‌కు 36 సంవత్సరాలుగా గెలుపు లేదు!
Dhoni Rohit Sharma: హిట్ మ్యాన్‌పై మహీ పొగడ్తలు.. ఏమన్నాడంటే
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం
