HomeAndhra PradeshSharmila: కరెంటు చార్జీల భారం ఉపసంహరించుకోవాలి

Sharmila: కరెంటు చార్జీల భారం ఉపసంహరించుకోవాలి

Sharmila: ఏపీలో రూ.6 వేల కోట్ల కరెంటు చార్జీల భారం మోపేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందని, వెంటనే దీన్ని వెనక్కు తీసుకుని ప్రభుత్వమే ఆభారాన్ని భరించాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (Sharmila) డిమాండ్ చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.

ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం రూ.6 వేల కోట్లు విద్యుత్ భారాన్ని ప్రజలమీద మోపడానికి సిద్ధంగా ఉన్నారని వార్త వచ్చిందన్నారు. రూ. 6 వేల కోట్లు చిన్న అమౌంట్ కాదని, ఏకంగా 40 శాతం హైక్ కు మీరు అప్రూవల్ ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. జగన్ మోహన్ రెడ్డి సర్కారు బకాయిలు పెట్టి ఉండొచ్చు. అయినా, ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు కదా. 6 వేల కోట్లు భారం ప్రజలపై మోపడం న్యాయం కాదు.

11 సార్లు వైసీపీ కరెంటు చార్జీలు పెంచింది కాబట్టే ప్రజలు మీకు ఓటేశారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. మళ్లీ మీరు రూ.6 వేల కోట్లు కరెంటు చార్జీల భారం ప్రజలపై మోపితే మీకూ వాళ్లకూ తేడా ఏముంది? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అమలు ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. ఫ్రీ బస్సు కూడా అమలు చేయలేకపోయారన్నారు. పెద్ద స్కీములు ఎలా అమలు చేస్తారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలు మొత్తం బీజేపీకి ఊడిగం చేశారని, ఇప్పుడు చంద్రబాబు సర్కారుదీ అదే తీరు అన్నారు. మన ప్రజలకు ఏ లాభం వస్తోందని సపోర్ట్ చేస్తున్నారు? అని షర్మిల ప్రశ్నించారు.

వైసీపీకి వచ్చిన చెడ్డ పేరే మీకు వస్తోందన్నారు. ఉచిత ఇసుక అంటూనే ఖర్చులు పెంచేస్తున్నారని, లోడింగ్, ట్రాన్స్ పోర్ట్ చార్జీలు పెంచుతున్నారన్నారు.

ఇథనాల్ పరిశ్రమపై ఆందోళన
‘‘తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు మారోతి శివ గణేష్ నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. గోకవరం మండలం, గుమ్మళ్లదొడ్డి గ్రామంలో నాలుగు రోజులుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు. కారణం, అసాగో ఇథనాల్ పరిశ్రమ వల్ల ఎంతో మంది అక్కడ గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, రెస్పిరేటరీ సమస్యలకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

ఇప్పటికే 10 మంది చనిపోయారు. ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. ఇథనాల్ పరిశ్రమను వెంటనే మూయించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ నాయకుడు శివ గణేష్, టీమ్ నిరాహార దీక్ష చేస్తున్నారు. 10 గ్రామాల వాళ్లు మా పార్టీ చేస్తున్న కార్యక్రమానికి మద్దతు పలికారు. ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో ఎంతో మంది భాగం అయ్యారు.

కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే మీ కళ్లకు కనపడకపోతే, మీ కలెక్టర్ గానీ, మీ యంత్రాంగం కానీ స్పందించకపోతే మరి అక్కడ మీ యంత్రాంగం బతికే ఉందా, నిద్రపోతోందా?

మేమైతే మా పార్టీ నాయకులకు ఇక చాలు అని చెప్పినా వాళ్లు అక్కడ నిరాహార దీక్ష విరమించడానికి సుముఖంగా లేరు. కానీ శివ గణేష్,టీమ్ కు పీసీసీ అధ్యక్షురాలిగా ఇక ఈ నిరాహార దీక్ష విరమించాలని కోరడమే కాదు, ఆజ్ఞాపిస్తున్నాం. కలెక్టర్, ప్రభుత్వం స్పందించకపోయినా మీ బదులు నేను నిరాహార దీక్ష చేస్తాను. ఈ పోరాటానికి బ్రేక్ ఇవ్వాలి.’’ అని షర్మిల చెప్పారు.

ఇవీ చదవండి: Jagan and Sharmila: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు
Sharmila on Jagan: షర్మిల కౌంటర్.. ఇది సామాన్యం కాదు జగన్ సార్!
Jagan vs Sharmila: జగన్ వర్సెస్ షర్మిల.. ఆస్తుల గొడవల్లో అసలేం జరిగింది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు