HomeAndhra PradeshCM Chandrababu: ఇసుక, మద్యంలో జోక్యం వద్దు.. చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu: ఇసుక, మద్యంలో జోక్యం వద్దు.. చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu: ఇసుక, మద్యం పాలసీల్లో ఎవరూ జోక్యం చేసుకోద్దని టీడీపీ నాయకులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు చంద్రబాబు.

చంద్రబాబు ఏమన్నారో ముఖ్యాంశాలివీ..
‘‘మద్యం మొన్నటి వరకు నాసిరకం, సొంత బ్రాండ్స్ తయారీ నుంచి లాస్ట్ వరకు వీళ్ల మనుషులను పెట్టుకొని నాసిరకం మద్యం ఇచ్చారు. మనుషుల ప్రాణాలతో ఆడుకున్నారు. మద్యం పాలసీని నిన్న, మొన్న అమలు చేశాం. ఇసుక మన ఊరుల్లో దొరికే ఇసుక కూడా అందుబాటులోకి లేకుండా చేశారు. మొన్న వర్షాకాలంలో ఇసుక లేదు. నదిలో ఇసుక ఉంది బయట లేదు. నిర్మాణాలు ఆగిపోయాయి.

మనం వచ్చాక ఒక ఆశ వచ్చింది. నిర్మాణాలు స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇసుక దొరికే పరిస్థితి లేదు. పాలసీల్లో అన్నీ మార్చాం. వేరే వాళ్లు కూడా మన దానిలోకి వచ్చి జోక్యం చేసుకుంటున్నారు. ఒక చిన్న సీనరేజ్ పెడితే రూ.85 సీనరేజ్ కి కట్టాలి. దానికి 15శాతం జీఎస్టీ కట్టాలి. దగ్గర దగ్గర 97 కట్టాలి. రూ.97 కట్టాల్సి వస్తే ఈ ముసుగులో వైఎస్ఆర్ సీపీ నాయకులు వచ్చి మేము 30 కి ఇసుక ఇస్తామని అంటారు. ఎలా ఇస్తారంటే ఆ 97 ఎగ్గొట్టి, వీళ్లు బ్లాక్ లో అమ్ముకోవడానికి వాళ్లు తెలివి మితిమీరి పోయాయి. రేపు కూడా మనకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధానాన్నికి వీళ్లు శ్రీకారం చుడుతున్నారు. అందుకే నేను కార్యకర్తలను ,నాయకులను కోరుతున్నా.

ఈ విషయాల్లో జోక్యం అవ్వలొద్దు. రాబోయే రోజుల్లో మద్యం షాపులు, ఇసుకల్లో కానీ ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఎవరికీ ఇబ్బంది లేకుండా అనుకున్న స్ఫూర్తిని లాస్ట్ వరకు తీసుకెళ్లే బాధ్యత నాది. ఎవరైనా సరే ఇసుక విషయంలో దందా చేస్తే మీరు తిరుగుబాటు చేయండి -నేను మీకు అండగా ఉంటా. మద్యాన్ని కూడా చెబుతున్నా మద్యంపైనా కూడా ఎమ్మార్పీ ధరలున్నాయి…ఎవరైనా ఎక్కువ ధరకి అమ్మితే వారిపై యాక్షన్ తీసుకుంటా. మందుబాబులకి కూడా చెబుతున్నా ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వవద్దు మీరు. ప్రభుత్వానికి మద్యం, ఇసుక పాలసీలు అత్యంత కీలకం. రూపాయి కూడా అవినీతి జరగడానికి లేదు.

1995 సీబీఎన్ అని చెప్పా
సీఎం అందుబాటులో లేరని చాలా మందికి అనిపిస్తోంది. కానీ నేను ఎన్నో సార్లు చెప్పాను. నేను 1995 సీబీఎన్ తప్ప 2014 సీబీఎన్ కాదని మీకు చాలా స్పష్టంగా చెప్పా. 1995 సీబీఎన్ అంటే పార్టీని, గవర్నమెంట్ ని సమర్ధవంతంగా నడిపించాం. అందరికీ ఆలోచన విధానాలన్నీ మారిపోయాయి. ఆలోచన విధానాలు మారినప్పుడు పారదర్శకంగా చేయడం తప్ప వేరే మార్గం లేదు. కచ్చితంగా రాజకీయ గవర్నమెంట్ ఉంటుంది. ఎవరైనా సరే రాజకీయ ముసుగులో తప్పులు చేసి మళ్లీ తప్పులు చేయాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు.’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: Gadikota: ఉచిత పంటల బీమాకు చంద్రబాబు సర్కార్ మంగళం
CBN on Jagan Family issue: జగన్ ఫ్యామిలీ ఇష్యూపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
CM CBN on Railway Projects: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Amaravati Drone show: తొలి రోజు డ్రోన్ షో విశేషాలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు