Viral Video: లవ్ రెడ్డి సినిమాలో విలన్ పాత్ర చేసిన తెలుగు నటుడు ఎన్‌టి రామస్వామిని ఓ మహిళ చెంప దెబ్బ కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తెలుగు తాజా చిత్రం లవ్ రెడ్డి ప్రదర్శన సమయంలో ఓ మహిళ ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా పైకి వచ్చి నటుడు ఎన్టీ రామస్వామిపై దాడి చేసింది. సినిమాలో విలన్ పాత్రలో నటించిన రామస్వామి.. హైదరాబాద్‌లో జరిగిన స్క్రీనింగ్ ఈవెంట్‌కు తన సహనటులతో హాజరయ్యారు.
నటీనటులు అభిమానులతో సంభాషించగా, వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్న సమయంలోనే ఎన్టీ రామస్వామిపై ఒక మహిళ దాడి చేసింది. ఆ మహిళ అతనిని కాలర్ పట్టుకుని చెంపదెబ్బ కొట్టింది. తెరపై అతని పాత్ర చూసి హర్ట్ అయినట్లు చెబుతోంది. అందుకు సంబంధించిన సీన్ వీడియో శుక్రవారం ఎక్స్ లో వైరల్ అయ్యింది.
క్లిప్ లవ్ రెడ్డిలోని సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఇందులో NT రామస్వామి పాత్రలో తన తలపై రాయితో కొట్టుకుంటాడు. ఆపై తన ఆన్-స్క్రీన్ కూతురిని రాయితో కొట్టి ఆమెను అవమానిస్తాడు. సినిమా నటులు థియేటర్‌లో ప్రేక్షకులను పలకరిస్తున్న సమయానికి ఇదిర ప్లే అవుతుంది. దీంతో ఎన్టీ రామస్వామిపై ఒక మహిళ దాడి చేస్తుంది. మహిళా అభిమాని అతని కాలర్ పట్టుకుని అతని ముఖంపై కొట్టింది. అప్పుడు, ఇతర నటీనటులు అది కేవలం సినిమా మాత్రమే అని ఆమెకు గుర్తు చేస్తారు. బంగారం లాంటి అమ్మాయిని ఎందుకు కొట్టావని, జంటను విడదీశావు.. అంటూ పచ్చి బూతులతో సదరు మహిళ రెచ్చిపోయింది. ఈ సమయంలో ఎన్టీ రామస్వామి భయంతో వణికిపోయినట్లు కనిపించారు.
NT రామస్వామికి రక్షణగా సహ నటులు అంజన్ రామచంద్ర, శ్రావణి కృష్ణవేణితో సహా థియేటర్ సెక్యూరిటీ, నటీనటులు రంగంలోకి దిగారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అభిమానులను అక్కడి నుంచి బయటకు పంపేశారు. అయితే, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూ కామెంట్లు పెట్టడం గమనార్హం. మూవీపై ఆసక్తి పెంచేందుకు ఇలాంటి ట్రిక్స్ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహించిన లవ్ రెడ్డి క్లాసిక్ ప్రేమకథకు భిన్నంగా వచ్చింది. భావోద్వేగాల సుడిలో చిక్కుకున్న నారాయణ రెడ్డి అనే ప్రధాన పాత్ర చుట్టూ ఈ చిత్రం సాగింది. ఎన్టీ రామస్వామి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అతని పాత్ర ప్రధాన జంట జీవితంలో మలుపులు తెస్తుంది. లవ్ రెడ్డిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది.
ఇవీ చదవండి: Ananya Nagalla: కమిట్మెంట్‌పై అనన్య నాగళ్ల కామెంట్స్ వైరల్
Mrunal Thakur hot: బాత్ టబ్బులో మృణాల్ హాట్ పోజులు.. విషయం అదా?
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఫొటో గ్యాలరీ
Rashi Singh: రాశి సింగ్ హాట్ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్ పిక్స్!!
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్ షో.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వైరల్
