Sunday, February 22, 2026
HomeAndhra PradeshDiarrhea Vizianagaram: డయేరియా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి

Diarrhea Vizianagaram: డయేరియా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి

Diarrhea Vizianagaram: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. డయేరియా బాధితులను ఆయన వైయస్సార్ సీపీ నేతలతో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగడం వల్లే గుర్లతో పాటు పలు గ్రామాల్లో ఈ మరణాలు సంభవించాయని తెలిపారు.

ఇప్పటివరకు ప్రభుత్వ అధికారక లెక్కల ప్రకారం 11 మంది చనిపోయారని ప్రకటించిగా.. బాధిత గ్రామాల ప్రజలు మాత్రం మరో ఐదుగురు డయేరియాతోనే చనిపోయినట్లు చెపుతున్నారన్నారు. ఇవాళ డయేరియా ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన బొత్స… గ్రామాల్లో పారిశుద్ద్యం లోపం, కలుషిత నీటి వల్లే డయేరియా వ్యాప్తి చెందిందని, ఇది ప్రభుత్వ పర్యవేక్షణ లోపమేనని తేల్చి చెప్పారు.

డయేరియా మృతులది సహజ మరణం కాదని కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన మరణాలు కాబట్టి… చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

డయేరియా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం… గత వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేయడాన్ని బొత్స తప్పుపట్టారు. జిల్లా చరిత్రలో గతంలో డయేరియాతో ఇంత మంది మృత్యువాత పడిన ఘటనలు లేవన్నారు.

అధికారులు ఇప్పటికైనా బాధిత గ్రామాల్లో ఇంటింటికి సర్వే చేసి.. తగిన నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు వారికి కావాల్సిన మందులు, మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు.

ఇవీ చదవండి: Botcha Satyanarayana: ఆ 25 వర్గాలకు చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారా?
MLC Botcha: టీటీడీలో కల్తీ నెయ్యి ఆరోపణల్లో చంద్రబాబే దోషి
Botcha Satyanarayana: నాకు తండ్రిలాంటి వాడు.. సీఎం జగన్‌ వ్యాఖ్యలతో మంత్రి బొత్స భావోద్వేగం!
Vizianagaram: ఆ మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారి చేత విచారణ
YSRCP MLC: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading