HomeAndhra PradeshCBN in Party Meeting: ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: సీఎం చంద్రబాబు

CBN in Party Meeting: ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: సీఎం చంద్రబాబు

CBN in Party Meeting: గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైయస్సార్ సీపీ సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధుల సమావేశంలో (CBN in Party Meeting) చంద్రబాబు మాట్లాడారు.

’’125 రోజుల త‌ర్వాత మ‌నం ఇక్క‌డ స‌మావేశ‌మై భ‌విష్య‌త్ లో పార్టీని ముందుకు తీసుకెళ్లాల‌ని స‌మీక్ష చేసుకోవాలి.

నేష‌న‌ల్ లెవ‌ల్‌లో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్ర‌భుత్వం ఉంది. 2014లో కేంద్రంలోమ‌న మంత్రులు, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఉన్నారు.

జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ క‌లిసి పోటీ చేశాం. గ‌వ‌ర్న‌మెంట్ లో కూడా మూడు పార్టీలు క‌లిసి ఉన్నాం. పార్టీల మ‌ద్య స‌మ‌న్వ‌యం చేసుకోవాలి. 5 సంవ‌త్స‌రాలు అన్ని విధాలా న‌ష్ట‌పోయి ఎన్ని త్యాగాలు చేశారో అన్ని త్యాగాలు చేసిన వాళ్ల‌ను కూడా గుర్తు పెట్టుకోవాలి.

నాల్గ‌వ సారి ముఖ్య‌మంత్రిని నేను. నాల్గ‌వ సారి ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత ఇన్ని డిఫ‌క‌ల్టీస్ ఎప్పుడూచూడ‌లేదు. గ‌త ఐదేళ్లు రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశారు. ఉన్న‌ది లిమిటెడ్ ఆఫీస‌ర్స్‌, ఆ లిమిటేష‌న్స్ ఒక‌ప‌క్క‌, ఆ రోజు ప‌నిచేసిన వాళ్లు కూడా చాలా మంది కొన్ని విష‌యాల్లో ఇన్వాల్వ్ అయ్యారు.

కేంద్రం ఇచ్చే డ‌బ్బుల‌ను తెచ్చి ఎక్క‌డిక‌క్క‌డ వేరే అకౌంట్ల‌కు డైవ‌ర్ట్ చేశారు. ఇప్పుడు కేంద్రాన్ని డ‌బ్బులు అడిగితే గ‌తంలో దేనికి వాడారో చెప్పండి అప్పుడు ఇస్తామ‌ని చెబుతున్నారు.

పంచాయ‌తీరాజ్‌లో 990 కోట్లు డైవ‌ర్ట్ చేశారు. 1200 కోట్లు నెక్ట్స్ రావాలి. ముందు 990 కోట్లు ఇవ్వాలంటే ట్రెజ‌రీ ఎమ్టీ.

నిన్న ప్ర‌ధాని మాట్లాడుతూ బీజేపీకి 2 సీట్లు నుంచి గుర్తు పెట్టుకుని ఏ విధంగా క‌ష్ట‌ప‌డ్డాం, ఈ రోజు తిరుగులేని శ‌క్తిగా ఎదుగ‌డానికి ఆ రోజు తీసుకున్న నిర్ణ‌యాలు అని చెప్పారు.

మ‌న‌ది ప్రాంతీయ పార్టీ అయినా దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన స‌మ‌యాల్లో క్రూషియ‌ల్ రోల్ పోషించాం. ఎలాంటి ప‌ద‌వులు ఆశించ‌కుండా ప‌నిచేసిన పార్టీ టీడీపీ.

టీడీపీకి విశ్వ‌స‌నీయ‌త ఉంది. దేశం కోసం, రాష్ట్రం కోసం ప‌నిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.

మూమూలుగా ఒక వీఐపీని పిలిస్తే ఒక స్పీచ్ ఇచ్చి వెళ్లిపోతాం. అయితే నిన్న ఐదు గంట‌లు అంద‌రి ముఖ్య‌మంత్రుల‌తో కూర్చొని వ‌చ్చే ఎన్నిక‌ల గురించి ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

ఈసారి గ‌త ఐదేళ్లు జ‌రిగిన అరాచ‌కం. అంద‌రం ఇబ్బంది ప‌డ్డాం. న‌న్ను కూడా జైల్లో పెట్టారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు వ‌చ్చి క‌లిసి పోటీ చేస్తాం అన్నారు. బీజేపీ కూడా వ‌చ్చింది మూడు పార్టీలు క‌లిసి ఎన్నిక‌ల్లోపోటీ చేశాం.

సామాజిక న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో బీసీల‌కు అగ్ర‌స్థానం ఇచ్చాం.

65 మంది కొత్త ఎమ్మెల్యేలు వ‌చ్చారు. చ‌దువుకున్న‌వాళ్లు వ‌చ్చారు. 18 మంది కొత్త మంత్రులు ఉన్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయని తప్పులు లేవు. అందుకే 11కు పడిపోయారు. 175 వస్తాయని చెప్పి ఎందుకు గెలవలేకపోయారు అంటే ప్రజల్లో వాల్లు చేసిన తప్పులు ఉండిపోయాయి. మనం నిలబడ్డాం.. ఎదురించాం కాబట్టే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 93 శాతం ఓట్లతో ఇన్ని సీట్లు గెలిచాం.

తప్పుచేసిన వాళ్లను వదిలిపెట్టం. కక్ష సాధింపులకు పాల్పడుతున్నామని ప్రజలు భావిస్తే ఇద్దరికీ వ్యత్యాసం ఉండదని అనుకుంటారు.’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: CBN on YSRCP: జగన్ నిర్ణయాలపై చంద్రబాబు ఆగ్రహం.. కేబినెట్ తర్వాత ఏమన్నారంటే..
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!
CBN on BJP Alliance: బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్ల తృప్తి, ఆనందం: చంద్రబాబు
Chandrababu Naidu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
CM Chandrababu: జే బ్రాండ్స్ తెచ్చి ప్రజల ప్రాణాలు తీసిన జగన్: చంద్రబాబు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు