HomeAndhra PradeshYS Jagan on YSR Padayatra: నాన్న పాద‌యాత్ర‌ను గుర్తు చేసుకుంటూ నా ప్ర‌యాణం.. వైఎస్...

YS Jagan on YSR Padayatra: నాన్న పాద‌యాత్ర‌ను గుర్తు చేసుకుంటూ నా ప్ర‌యాణం.. వైఎస్ జ‌గ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్

YS Jagan on YSR Padayatra: ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రి, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌ను ఆయ‌న త‌న‌యుడు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ గుర్తు చేసుకున్నారు. చారిత్రాత్మ‌క ఆ పాద‌యాత్రచేప‌ట్టి నేటికి 23 ఏళ్లు అయిన సంద‌ర్భంగా జ‌గ‌న్ ఎమోష‌నల్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లకు చేసిన మంచి, రూపురేఖ‌లు మారిన తీరును ఆయ‌న ఈ సంద‌ర్భంగా నెమ‌రువేసుకున్నారు. ట్వీట్లో జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల‌ద‌ని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాద‌యాత్ర‌. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్ర‌టి ఎండ‌లో ప్ర‌జ‌ల క‌ష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేప‌ట్టిన ఆ పాద‌యాత్ర రాష్ట్ర ప్ర‌జ‌ల హృద‌యాల్లో ధైర్యం నింపింది. నేనున్నాన‌నే భ‌రోసా ఇచ్చింది.

నాన్న‌కు రాష్ట్రం మొత్తం మ‌ద్ద‌తుగా నిలిచి ముఖ్య‌మంత్రిని చేసింది. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంత‌కం చేసిన ద‌గ్గ‌రి నుంచి ఆయ‌న తీసుకు వ‌చ్చిన ఎన్నో సంస్క‌ర‌ణ‌లు, ప‌థ‌కాలు రాష్ట్ర రూపు రేఖ‌లు మార్చేశాయి. రైతును రాజుగా నిలిపాయి. అక్క‌చెల్లెమ్మ‌లు వారి సొంత కాళ్ల‌పై నిల‌బ‌డేలా చేశాయి.

బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయి. ఎంతో మంది పేద పిల్ల‌లు డాక్ట‌ర్లుగా, ఇంజినీర్లుగా, క‌లెక్ట‌ర్లుగా అయ్యేలా చేశాయి. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సంద‌ర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్ర‌యాణం కొనసాగుతుంది. అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

ఇవీ చ‌ద‌వండి: YS Jagan Warning to ABN: ఏబీఎన్ రాధాకృష్ణ‌కు జ‌గ‌న్ సీరియ‌స్ వార్నింగ్.. బీఆర్ నాయుడు, అర‌వ శ్రీధర్ పైనా..!
YS Jagan: ఏబీఎన్ రాధాకృష్ణ‌పై వైఎస్ జ‌గ‌న్ ఫైర్.. ఆడ‌వాళ్ల‌పై ఏమిటీ రాత‌లంటూ మండిపాటు
YS Jagan MAVIGUN: దేశంలో అతి పెద్ద స్కామ్‌కు క్యాపిటల్‌ అమరావతి.. మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు.. మ‌.వి.గ‌న్ అంటూ జగన్‌ సంచ‌ల‌నం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు