HomeCinemaMaa Nanna Superhero Review: మా నాన్న సూపర్‌ హీరో సినిమా రివ్యూ..

Maa Nanna Superhero Review: మా నాన్న సూపర్‌ హీరో సినిమా రివ్యూ..

Maa Nanna Superhero Review: సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. (Maa Nanna Superhero) ఈ మధ్య కాలంలో అన్నీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రాల్లోనే నటిస్తూ సుధీర్ బాబు మెప్పిస్తున్నాడు. తాజాగా మా నాన్న సూపర్ హీరో అంటూ ఓ ఎమోషనల్ మూవీతో ఆకట్టుకునేందుకు ప్రేక్షకులముందుకొచ్చాడు.

మూవీ: మా నాన్న సూప‌ర్ హీరో
యాక్టర్లు: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, దేవి ప్ర‌సాద్ ఇతర నటులు
మ్యూజిక్: జై క్రిష్
సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి
రైటర్: ఎంవీఎస్ భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర
డైరెక్టర్: అభిలాష్ రెడ్డి కంకర
ప్రొడ్యూసర్: సునీల్ బలుసు
రిలీజ్ డేట్: 11-10-2024

క‌థ ఏంటంటే..
జానీ (సుధీర్‌బాబు) (Sudheer Babu) పుట్టగానే త‌ల్లిని పోగొట్టుకుంటాడు. క‌న్న‌తండ్రి ప్ర‌కాశ్ (సాయిచంద్‌) ఓ నేరంలో తాను చేయని తప్పునకు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో జానీ అనాథ‌శ్ర‌మంలోకి వెళ్లి పెరుగుతాడు. అనంతరం అత‌డిని శ్రీనివాస్‌ (సాయాజీ షిండే) ద‌త్త‌త తీసుకుంటాడు. తొలుత సొంత కుమారుడిలా అల్లారుముద్దుగా ప్రేమించి చూసుకుంటాడు. కానీ భార్య (ఆమ‌ని)ను కోల్పోవ‌డం, స్టాక్ మార్కెట్‌లో బాగా నష్టపోతాడు.

జానీని ఇంటికి తెచ్చుకోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని అనుకుంటాడు. అతనిపై ద్వేషం పెంచుకుంటాడు. కానీ, జానీ మాత్రం త‌న‌కు ఓ కుటుంబాన్ని ఇచ్చిన శ్రీనివాస్‌ను సొంత తండ్రి కంటే బాగా ప్రేమను పంచుతాడు. ఓ హీరోలా భావిస్తాడు. (Maa Nanna Superhero Review) స్టాక్‌మార్కెట్‌లో భారీ లాభాలొస్తాయ‌ని చెప్పి ఊళ్లోని ఓ నాయ‌కుడితో శ్రీనివాస్ ఎక్కువ మొత్తం షేర్ల‌లో ఇన్వెస్ట్ చేయిస్తాడు. అందులో తీవ్ర న‌ష్టాలు రావ‌డంతో ఆ నాయ‌కుడు శ్రీనివాస్‌ను జైల్లో పెట్టిస్తాడు. తీవ్రంగా చిత్రహింసలు పెడతాడు.

ఈ నేపథ్యంలో తన తండ్రిని కాపాడుకునేందుకు ఆ అప్పు బాధ్య‌త‌ను తాను తీసుకుంటాడు. దీని కోసం రూ.కోటి అవసరం అవుతుంది. ఇక 20 ఏళ్ల త‌ర్వాత జైలు నుంచి విడుద‌లైన ప్ర‌కాశ్ త‌న బిడ్డ‌ను వెతుక్కుంటూ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? జానీ తన దత్త తండ్రిని కాపాడాడా? ఈ క్ర‌మంలో ప్ర‌కాశ్‌తో క‌లిసి ఎందుకు ప్ర‌యాణం చేస్తాడు? జానీనే త‌న కొడుక‌ని ప్ర‌కాశ్‌ ఎలా కనుక్కొంటాడు అన్నది మిగతా కథ.

కథనం ఎలా సాగింది?
సినిమా టైటిల్ లో చెప్పినట్లుగానే ఇది ఓ తండ్రీ కొడుకుల కథ. ఇద్దరు తండ్రుల ట్రై సిరీస్ ప్రేమ కథ. ఈ తరం ఆడియన్స్ కోరుకున్నట్లుగా కాస్త కొత్తదనం యాడ్ చేశారు. మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా భావోద్వేగ‌ పూరితంగా సీన్లు ఉంటాయి. అయితే, ద‌ర్శ‌కుడు అభిలాష్ రెడ్డి తాను చెప్పాల‌నుకున్న క‌థ‌ను నిజాయితీగా చెప్పే ప్ర‌య‌త్నం చేసినప్పటికీ.. కథలో రాసున్నంత బలంగా తెరపైకి ఎక్కించడంలో కాస్త తడబడినట్లు అర్థం అవుతోంది.

స్టోరీలో బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ, పాత్ర‌ల తాలూకూ ఎమోష‌న్‌ను ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా చూపలేకపోయారు. ప్ర‌కాశ్ త‌న బిడ్డ‌కు ఎలా దూర‌మ‌య్యాడన్న స్టోరీతో మూవీ ఆసక్తిగా ప్రారంభం అవుతుందతి. (Maa Nanna Superhero Review) అనంతరం కథ అంతా జానీ – శ్రీనివాస్‌ల వెంటే తిరుగాడుతుంది. వీరిద్దరి నడుమ కొన్ని సీన్లు బాగా పండాయి. తండ్రి త‌ప్పుల్ని వెన‌కేసుకొస్తూ.. అత‌ను చేసే అప్పులు తీర్చే కుకమారుడిగా జానీ పాత్ర బాగా తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులకు నచ్చుతుంది.

ఇక ప్ర‌కాశ్ జైలు నుంచి రిలీజ్ అయ్యి తన కొడుకు కోసం వెతకడం మొదలు పెట్టిన సీన్ నుంచి క‌థ‌లో ఓ సంఘ‌ర్ష‌ణ‌తో పాటు ఎమోష‌నల్ డ్రామా స్టార్ట్ చేశారు. అదే క్రమంలో జైలుకు వెళ్లిన శ్రీనివాస్‌ను రక్షించుకునేందుకు జానీకి రూ.కోటి అవ‌స‌ర‌ం కావడం, అది కూడా కేవలం 20 రోజుల్లోనే స‌ర్దుబాటు చేయాల్సి ఉండటం కథను రక్తి కట్టిస్తుంది. స‌రిగ్గా ఇక్క‌డే ప్ర‌కాశ్ క‌థ‌లోకి జానీని రప్పించడం, మ‌హేశ్ పేరుతో జానీ ఆడే డ్రామా.. ఇంటర్వెల్ సీన్లు కాస్త ఇంట్రస్ట్ గా మార్చేశాయి. ఇక్క‌డి నుంచి సెకండాఫ్ అంతా ప్రకాశ్‌-జానీల చుట్టూ తిరుగుతుంది. వీరికి ఓ ట్రావెల్ ట్రాక్‌ను డైరెక్టర్ సెట్ చేశాడు. కాక‌పోతే దాన్ని ఎమోష‌న‌ల్ డ్రామాగా తెరకెక్కించడంలో కాస్త ఇబ్బందులు ఎదురైనట్లు అర్థం అవుతోంది. ప్రీ-క్లైమాక్స్‌లో మనీ కోసం ప్ర‌కాశ్-జానీల‌ మ‌ధ్య న‌డిచే చిన్నపాటి ఫైట్స్, అప్పుడే పండే ఎమోషనల్ సీన్లు కథను ఆసక్తికరంగా మార్చాయి.

నటీనటులు ఎలా చేశారు
జానీ పాత్ర‌లో సుధీర్‌బాబు (Sudheer Babu) పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. నటనతో ఆకట్టుకున్నాడు. తండ్రిని హీరోలా భావించే కుర్రాడిగా.. అత‌ని ప్రేమ‌ను ద‌క్కించుకునేందుకు త‌ప‌నపడిన కొడుకుగా సహజమైన నటను సుధీర్ బాబు చేశాడు. ఎమోషనల్ సీన్లనూ పండించాడు. సాయాజీ షిండే పాత్ర‌ను తీర్చిదిద్దిన తీరు ఆక‌ట్టుకుంది. అయితే అందులో ఎమోషన్స్ పెద్దగా పండలేదు. సాయిచంద్ పాత్రకు భావోద్వేగ టచ్ ఇచ్చాడు కానీ హీరో పాత్ర‌తో లింక్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ లేదు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి (Abhilash Kankara) ఎంచుకున్న క‌థ‌లో కొత్తదనం కనిపించింది. దాన్ని తాను అనుకున్న‌ట్లుగా గాడి త‌ప్ప‌కుండా నిజాయితీగా తెరకెక్కించేందుకు చేసిన ప్రయత్నం, కష్టపడిన విధానం సినిమాలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, మనసు హత్తుకునేలా ఎమోషన్స్ ను చూపడంలో కాస్త తడబడ్డాడు.

కథలోని కొత్తదనం, సుధీర్ బాబు నట, సాయిచంద్ పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ సీన్లు ఈ మూవీకి బలం. అలాగే కాస్త స్లో నరేషన్, ఎమోషన్స్ పండకపోవడం కాస్త వీక్ పాయింట్లుగా చెప్పొచ్చు. అయితే, ఎమోషనల్ సీన్లపై ఇంకాస్త కసరత్తు దర్శకుడు చేసి ఉంటే మా నాన్న హీరో మూవీ మరో రేంజ్ లో ఉండేది.

చివరగా..
ఎమోషన్స్ తక్కువ.. డ్రామా ఎక్కువ.. మా నాన్న సూపర్ హీరో

రేటింగ్: 3/5

Read also: Satyam Sundaram Review: సత్యం సుందరం మూవీ రివ్యూ.. 
Devara Review: దేవర సినిమా రివ్యూ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ ఎలా ఉందంటే..
Mister Bachchan Review: మిస్టర్ బచ్చన్ రివ్యూ.. 2011-12 తర్వాత సినిమాలు రాలేదా?
Family Star Movie Review: ‘ఫ్యామిలీ స్టార్’తో దేవరకొండ మెప్పించాడా? సినిమా రివ్యూ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు