HomeBusinessSmart Phone: మీ ఫోన్ పోగొట్టుకున్నారా? యూపీఐ ఐడీలు ఏమవుతాయంటే..

Smart Phone: మీ ఫోన్ పోగొట్టుకున్నారా? యూపీఐ ఐడీలు ఏమవుతాయంటే..

Smart Phone: మీ స్మార్ట్‌ ఫోన్‌ (Smart Phone) ఎక్కడైనా పడిపోయిందా? లేదా ఎవరైనా దొంగలించారా? మరి నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్‌ చేసుకోవాలో తెలుసా? వెంటనే యూపీఐ ఐడీలను బ్లాక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫోన్‌ పే ఎలా బ్లాక్ చేయాలంటే..
ఫోన్ పే ఐడీని బ్లాక్‌ చేసే ముందుగా 02268727374 లేదా 08068727374 నంబరుకు ఇతర ఫోన్‌ ద్వారా కాల్ చేయాలి. అనంతరం కస్టమర్‌ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాల్సి వస్తుంది. మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబరుతో పాటు మరికొన్ని వివరాలు తెలిపితే వారు ఫోన్‌ పే ఐడీని డీ యాక్టివేట్ చేసేలా చర్యలు తీసుకుంటారు.

గూగుల్‌ పే ఐడీ
గూగుల్‌ పేను బ్లాక్‌ చేయాలనుకుంటే ముందుగా మరో ఫోన్‌ నుంచి 18004190157కు డయల్ చేయాలి. కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడి ఐడీని బ్లాంక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం మరీ ఫోన్‌ నెంబర్‌తో పాటు మరికొన్ని వివరాలను అందించాల్సి ఉంటుంది.

పేటీఎం ఐడీని ఎలా బ్లాక్ చేయాలంటే..
పేటీఎమ్‌ ఐడీ బ్లాక్‌ విషయానికొస్తే 01204456456 హెల్ప్‌ లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేయాలి. అనంతరం మీ ఫోన్‌ నెంబర్‌ ద్వారా పేటీఎమ్‌ నుంచి లాగవుట్ అవ్వొచ్చు. ఆ తర్వాత పేటీఎమ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం 24 X 7 హెల్ప్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత రిపోర్ట్ ఎ ఫ్రాడ్ లేదా మెసేజ్ అస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో మీ ఫోన్‌ పోయిన విషయాన్ని తెలియజేస్తే, పేటీఎమ్‌ ఖాతా తాత్కాలికంగా బ్లాక్‌ అవుతుంది.

ఇండియాలో 2016 నుంచి యూపీఐ సేవలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో భారీగా యూపీపై చెల్లింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లో యూపీఐ ద్వారా 14.02 బిలియన్ల లావాదేవీలు జరిగాయట. ఇతర దేశాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు మన దేశంలో అనుసరిస్తున్న డిజిటల్ విధానం ఆదర్శంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు.

ఇవీ చదవండి: ICICI cash back: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇదిగో..
Double ISMART: డబుల్‌ ఇస్మార్ట్ టీజర్‌ వచ్చేసింది.. ఈసారి డబుల్‌ మాస్ గ్యారెంటీ!
Mobile Phone: స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు సగటున రోజుకు 80 సార్లు చెక్‌ చేస్తున్నారట!!
5G Smartphone: రూ.15,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..
Sony 85 Inches TV: సోనీ 85 అంగుళాల టీవీ.. ధర రూ.4,49,990 నుంచి ప్రారంభం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు