Peddi Reddy: పుంగనూరులో చిన్నారి అశ్వియ అంజుమ్ (7) హత్య అత్యంత దారుణం అని మాజీ మంత్రి పెద్ది రెడ్డి (Peddi Reddy) రామచంద్రారెడ్డి అన్నారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యం వల్లే చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం విషయంలో హడావుడి చేసిన చంద్రబాబు.. చిన్నారి విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పుంగనూరులో చిన్నారి అశ్వియ కుటుంబాన్ని ఈ నెల 9న వైఎస్ జగన్ పరామర్శిస్తారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
ఇవాళ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పుంగనూరులోని అశ్వియ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీడియాతో మాట్లాడారు.
చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ ఇంత దారుణం జరగలేదన్న ఆయన, రెండో తరగతి చదువుతున్న చిన్న పాపను దారుణంగా హత్య చేయడం దారుణమని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అశ్వియ కుటుంబానికి అండగా ఉంటుందని, వైయస్ జగన్ ఈ నెల 9న పుంగనూరు వచ్చి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు చెప్పారు.
చిన్నారి హత్య విషయంలో పోలీసులు మాత్రం కాలయాపన చేస్తున్నారన్నారు. ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయ స్ధితిలో ఉండటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అదే మదనపల్లి సబ్‌కలెక్టరేట్ అగ్నిప్రమాద ఘటనలో ఏం జరగకపోయినా స్వయానా డీజీపీని, సీఐడీ అడిషనల్ డీజీని, మరో అడిషనల్ డీజీని సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్ ఇచ్చిపంపారని, మరి ఇలాంటి విషయాల్లో ఎందుకు చొరవ తీసుకోలేదని ప్రశ్నించారు. చిన్నారి హత్య కేసులో దోషులను వెంటనే పట్టుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: Kurasala Kannababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు విషప్రచారం ఆపాలి
Varudu Kalyani: రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ కరువు
Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియపై కలెక్టర్ కు గంగుల నాని ఫిర్యాదు
Pawan Kalyan: స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: పవన్
Srinivasa Varma: గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి: కేంద్ర మంత్రి
