HomeInternationalJail: ప్రపంచంలోనే అత్యంత క్రూయల్ జైల్ ఏదో తెలుసా?

Jail: ప్రపంచంలోనే అత్యంత క్రూయల్ జైల్ ఏదో తెలుసా?

Jail: ఖైదీల వృషణాలకు విద్యుత్ షాక్‌లు ఇచ్చే జైలు ఏదో తెలుసా? సీరియల్ కిల్లర్లు, పిల్లలను లైంగికంగా వేధించేవారు, నరమాంస భక్షకులు వంటి ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గులైన నేరస్థులు రష్యన్ జైలులో ఉంటారట. ప్రస్తుతం అందులో 700 క్రిమినల్స్‌ శిక్షను అనుభవిస్తున్నారని సమాచారం. ఈ ప్రదేశం నుంచి బయటపడే ఏకైక మార్గం మరణం మాత్రమేనట. అంటే దీనిలోకి వెళ్లిన ఖైదీ జీవితం అక్కడే అంతం. ఈ జైలు ముఖ ద్వారం ముందు ఓ ఖైదీ తయారు చేసిన ఒక బ్లాక్ డాల్ఫిన్ స్టాచూ ఉంటుంది. దాని కారణంగా ఈ జైలుకి “బ్లాక్ డాల్ఫిన్ ప్రిజన్” పేరు వచ్చింది.

తప్పు చేసిన వారిని తీసుకొచ్చి జైళ్లో వేస్తారు. వారిలో మంచి మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. కాని కొన్ని జైళ్లు అత్యంత దారుణంగా ఉంటాయి. అలాంటి జైళ్లలో ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ఒకటిగా నిలుస్తోంది. అక్కడ ఖైదీలు అమానవీయ పరిస్థితులలో జీవిస్తారు, ఊహించలేని హింస ఉంటుంది. ఇది రష్యాలోని ఒరెన్‌బర్గ్ ఒబ్లాస్ట్‌లోని కలదు. దీన్ని బ్లాక్ డాల్ఫిన్ ప్రిజన్ అని కూడా అంటారు.

ఈ జైలులో గార్డ్స్ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గస్తీ తిరుగుతారు. ఖైదీలు గదుల నుంచి బయటకు వచ్చినట్లు గమనిస్తే వారికి నరకం చూపిస్తారు. వారిని నడుము వంచమని, చేతులు వెనుకకు పెట్టుకోమని, తుంటిపైకి ఎత్తి నడవమని బలవంతం చేస్తారు. ఖైదీలు పారిపోకుండా ఉండేందుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతితో ఖైదీకి చుట్టుపక్కల ఏమీ కనిపించకుండా చేసి, పారిపోయేందుకు ప్రణాళికలు వేయకుండా అడ్డుకోవచ్చు.

ఈ అత్యంత భద్రతా స్థాయి కలిగిన జైలులో 24 గంటలూ ఖైదీలను గమనించేందుకు శిక్షణ పొందిన గార్డ్స్ ఉంటారు. ఖైదీలు క్రూరమైన హింసలను భరించాల్సి వస్తుంది. దీనివల్ల వారి నరాలు చిట్లిపోతాయి. గార్డ్స్ ఖైదీల కాళ్లను దారుణంగా కొడతారు. హింసించేటప్పుడు లేదా విద్యుత్ షాక్స్‌ ఇచ్చేటప్పుడు నేరస్థులను బంధిస్తారు. బలవంతంగా “స్వాలో యోగా పొజిషన్‌”లో ఉండేలా చేస్తారు. ఈ పొజిషన్‌లో ఖైదీ తన కడుపుపై పడుకోవాల్సి ఉంటుంది. అలానే చేతులను వెనుకకు ఎత్తాలి, కాళ్లను పైకి లేపాలి.

ఇవీ చదవండి: Nigeria Jail: నైజీరియాలో భారీ వర్షాలకు కూలిన జైలు.. 118 మంది ఖైదీలు పరార్‌
Posani Krishna Murali: బాబుపై పోసాని సంచలన ఆరోపణలు జైల్లో ఉండి కుట్రపన్నారని వ్యాఖ్య
Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్‌కు రెండేళ్ల జైలు శిక్ష.. అల్లు అరవింద్‌ ఇచ్చిన పరువు నష్టం దావా కేసులో..!
YS Jagan: తప్పుడు సంప్రదాయాలు ఆపకుంటే మీకూ ఇదే గతి: వైయస్ జగన్ హెచ్చరిక
YS Jagan: రేపు గుంటూరులో వైయస్ జగన్ పర్యటన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు