Actor Prakash Raj: తిరుమల లడ్డూ వివాదంపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీరుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. నెయ్యిని రిజెక్ట్ చేశామని టీటీడీ ఈవో చెప్పిన నేపథ్యంలో ఆ నెయ్యిని వాడే పరిస్థితి లేదు కదా అని నిలదీసింది. ముఖ్యమంత్రి మాట్లాడిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేఫథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ దీనిపై స్పందించాడు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దంటూ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను ఉద్దేశించి సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను జత పరుస్తూ ట్వీట్ చేశాడు ప్రకాశ్ రాజ్. లడ్డూ వివాదంపై ఇటీవల వరుస ట్వీట్లు చేస్తున్న ప్రకాశ్ రాజ్.. ఇప్పుడు సుప్రీం తీర్పు నేపథ్యంలోనూ ట్వీట్లు చేయడం గమనార్హం.
తాజాగా సుప్రీంలో జరిగిన విచారణ సందర్భంగా కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎన్‌డీడీబీ మాత్రమే ఎందుకు? మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని టీటీడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్టు గుర్తించిన తర్వాత తయారైన లడ్డూలను పరీక్షకు పంపారా? అని ప్రశ్నించింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? అనే ప్రశ్నలు రైజ్ చేసింది.
ఎలాంటి పూర్తి ఆధారాలు లేకుండా లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ఏపీ ప్రభుత్వం ఎలా ప్రకటనలు చేస్తుందని ప్రశ్నించింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సుప్రీం మొట్టికాయలు వేసింది. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలంటూ చురకలంటించింది.
Read also: Supreme court on Tirumala Laddu: సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Tirumala Laddu: కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం
Tirumala Laddu Row: కల్తీ నెయ్యిపై మూడు రోజుల పాటు సిట్ విచారణ
Tirumala: కలి ప్రభావం.. అప్పుడే ఏమైంది..? ఇంకా మున్ముందు చాలా చూడాలి భక్తులారా…!
YS Jagan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
