HomeCinemaGame Changer: గేమ్ ఛేంజర్ అప్ డేట్.. రెండో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

Game Changer: గేమ్ ఛేంజర్ అప్ డేట్.. రెండో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ (Game Changer). కొన్నాళ్లుగా మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది క్రిస్మస్ కల్లా రిలీజ్ చేస్తామంటూ మొన్నామధ్య దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్ డేట్ ఏమైనా వస్తుందా అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

మూడు సంవత్సరాలుగా ఈ మూవీ సాగుతోందంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక సాంగ్, ఒక పోస్టర్ తప్ప ఎలాంటి తాజా సమాచారం లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇన్నాళ్లు ఫ్యాన్స్ నిరాశలో ఉంటే, ఇప్పుడు దీనిపై కొత్త అప్ డేట్ హల్ చల్ చేస్తోంది. దిల్ రాజు అప్ డేట్ చెప్పినప్పటి నుంచి గేమ్ ఛేంజర్ గురించి వార్తలు రకరకాలుగా వస్తున్నాయి.

సంగీత దర్శకుడు తమన్ కొన్నాళ్ల నుంచి వరుసగా గేమ్ ఛేంజర్ సినిమా అప్ డేట్ అంటూ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రీసెంట్ గా ఇవాళ గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్ డేటు వచ్చింది. సినిమాలోని రెండో పాట ’’రా మచ్చా మచ్చా…’’ (RAA MACHA MACHA) అంటూ సాగుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ పాట విడుదల చేస్తామన్నారు. సెకండ్ సాంగ్ వచ్చే టైమ్ ఆసన్నమైందని, మెగా బ్లాస్ట్ కు సిద్ధంగా ఉండాలని చిత్ర బృందం వెల్లడించింది. గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెండో పాట కూడా మెప్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

ఇవీ చదవండి: Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచారం ఆరోపణలు.. ఏం జరిగిందంటే..
Andhra Pradesh: సీమపై ఎందుకీ కక్ష? లా యూనివర్సిటీ, కొప్పర్తి అమరావతికి షిఫ్టింగ్! 
MG Comet EV: ఎంజీ కామెట్ ఈవీ కేవలం రూ.4.99 లక్షలకే!
Devara: రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది
Tirumala: కలి ప్రభావం.. అప్పుడే ఏమైంది..? ఇంకా మున్ముందు చాలా చూడాలి భక్తులారా…! 

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు