Esther Anil: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ లో అదరగొట్టిన ఎందరో యాక్టర్లు సినిమా ఇండస్ట్రీలో నేటికీ కొనసాగుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో బడా హీరోయిన్లుగా స్థిరపడిన వారూ ఉన్నారు. అనికా సురేంద్రన్, కావ్య కల్యాణ్ రామ్ లాంటి వాళ్లు ఈ కోవకు చెందిన వారే. ఇదే జాబితాలో చేరిపోతోంది ముద్దుగుమ్మ ఎస్తర్ అనిల్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన అందచందాలతో యువతలో క్రేజ్ సంపాదించుకుంది.
దృశ్యం సినిమాలో ఎస్తర్ అనిల్ నటించి మెప్పించింది. దృశ్యం 1, దృశ్యం 2 మూవీల్లో మంచి నటనతో మార్కులు కొట్టేసింది. మలయాళంలో విడుదలైన ఈ సిరీస్ లో మోహన్ లాల్ కూతురిగా ఎస్తర్ కనిపించింది.
తెలుగులో రీమేక్ గా వచ్చిన దృశ్యం మూవీలో కూడా ఎస్తర్ ఆ పాత్రల్లో కనిపించి అలరించింది. అప్పుడు క్యూట్ క్యూట్ మాటలతో అందరినీ ఫిదా చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ డోసు పెంచింది. ఇటీవల మాల్దీవులు వెళ్లిన ఎస్తర్ అక్కడ ఫొటో షూట్ చేసి వాటిని తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. అలాగే తన ఫొటో షూట్ లో ఎప్పటికప్పుడు ఫొటోలను నెట్టింట ఉంచుతూ కుర్రకారును కవ్విస్తోంది. ఫొటో గ్యాలరీ ఓ లుక్కేయండి.



