Vetrimaaran: తమిళ ఎంట్రీకి రెడీ అంటున్న జూనియర్ ఎన్టీఆర్.. (Jr NTR) తాజాగా దర్శకుడు వెట్రిమారన్ అంటే తనకు ఇష్టమని, త్వరలోనే ఆయన దర్శకత్వంలో పని చేయాలని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. తమిళంలో సరైన కథ పడితే నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. తాజాగా దేవర చిత్రం ప్రమోషన్స్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) బిజీగా గడుపుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో తెరెక్కుతున్న సినిమా చిత్రీకరణ అక్టోబరు 21 నుంచే మొదలవుతుందంటూ ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నేపథ్యంలో అందరిలో ఆసక్తి ఏర్పడింది. 40 రోజులపాటు సాగే తొలి షెడ్యూల్‌లో తాను పాల్గొననని, జనవరి నుంచి తనపై కీలక సన్నివేశాలనుే చిత్రీకరిస్తారని ఎన్టీఆర్ వెల్లడించాడు.
ఆ మూవీ పూర్తయిన తర్వాత ‘దేవర 2’ (Devara 2) షూటింగ్ మొదలువుతుంది. ఈలోగా చెన్నైలో (Chennai) జరిగిన మీడియా సమావేశంలో వెట్రిమారన్‌తో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పాడు. వెట్రిమారన్ కూడా ఈ సినిమా విషయమై రియాక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
ఆ వీడియోలో వెట్రిమారన్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కి ఇప్పటికే ఓ స్క్రిప్ట్ వినిపించానని చెప్పాడు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే జూనియర్ తో చేసే మూవీపై ఫోకస్ పెడతానని పేర్కొన్నాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ ఈ నెల 27న (Devaraonsept27th) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
