HomeAndhra PradeshYS Jagan: తప్పుడు సంప్రదాయాలు ఆపకుంటే మీకూ ఇదే గతి: వైయస్ జగన్ హెచ్చరిక

YS Jagan: తప్పుడు సంప్రదాయాలు ఆపకుంటే మీకూ ఇదే గతి: వైయస్ జగన్ హెచ్చరిక

YS Jagan: రాష్ట్రంలో తప్పుడు సంప్రదాయాలు ఆపకుంటే రేప్పొద్దున మీకు కూడా ఇదే గతి పడుతుంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తున్నారన్నారు. విజయవాడను వరదల్లో ముంచి 60 మందిని చావుకు సీఎం చంద్రబాబు కారణం అయ్యారని మండిపడ్డారు. వరదల అంశాన్ని డైవర్ట్ చేయడానికి మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. గుంటూరు సబ్ జైలులో నందిగం సురేష్ ను వైయస్ జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

రాష్ట్రం అంతా వర్షాలతో అతలాకుతలం అవుతున్న పరిస్థితులు ఉండి, విజయవాడలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యి 60 మందికిపైగా చనిపోయారని వైయస్ జగన్ మండిపడ్డారు. వరదల టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు ఒక దళిత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈనెల 4వ తేదీన రాత్రి హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేశారని ఆక్షేపించారు.

2021లో జరిగిన ఘటనపై ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నందిగం సురేష్ ను, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్టు చేశారని ప్రభుత్వంపై వైయస్ జగన్ మండిపడ్డారు. ఆరోజు టీడీపీ ఆఫీసులో ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి.. ముఖ్యమంత్రిగా ఉన్న తనపై భోషడికె అని తిట్టాడని.. అంటే లం.. కొడకా అని అర్థమన్నారు. ఆ మాదిరిగా ఒక తిడితే ముఖ్యమంత్రిని ప్రేమించేవాళ్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అభిమానించేవాళ్లకు కడుపు మండదా? అని ప్రశ్నించిన వైయస్ జగన్.. ఈ అన్యాయాన్ని చూడకూడదనుకునే వారు కొందరు టీడీపీ ఆఫీసు వద్ద ధర్నా చేశారని గుర్తు చేశారు.

ధర్నా చేయడానికి వచ్చిన వాళ్లపైనే దాడి జరిగిందన్నారు. కానీ నాడు చంద్రబాబుపై తాను కక్షసాధింపులకు దిగలేదన్నారు. ఆ ఘటనలో సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఎవరెవరు వెళ్లారో వారందరికీ 41ఏ నోటీసు ఇచ్చి అరెస్టు చూపించి కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. ఇది ఏడేళ్లలోపు శిక్ష పడే కేసు కాబట్టే ఇందులో అరెస్టు అన్నది సబబు కాదన్నారు. సురేష్ గానీ, డిప్యూటీ మేయర్ భర్త గానీ ఆరోజు లొకేషన్‌లో లేరని, టీడీపీ ఆఫీసులో ఉన్న సీసీ కెమెరాలు చూస్తే ఈ విషయం తెలియదా? అని జగన్ ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు తప్పుడు విట్నెస్ జోడించి, భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి లేనిపోని పేర్లన్నీ రాయించి అరెస్టులు చేయడం మొదలు పెడుతున్నారన్న జగన్.. ఈ ఒక్క కేసే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతోందని ఆక్షేపించారు. పోలీసులు కూడా తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి దిగజారిపోతున్నారని మండిపడ్డారు.

ఒక తప్పుడు సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలుకుతున్నారన్న జగన్.. ఇదే కొనసాగితే, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, ఒక తప్పుడు సంప్రదాయానికి మీరు వేసిన బీజం సునామీ అవుతుందని హెచ్చరించారు. రేప్పొద్దున మీ నాయకులందరికీ ఇదే గతి పడుతుందని, ఇదే జైల్లోనే మీరంతా ఉంటారన్నది గమనించాలని హితవు పలికారు.

రెడ్ బుక్ పెట్టుకోవడం చాలా సులభం
రెడ్ బుక్కులు మీరు ఒక్కరే పెట్టుకుంటారని అనుకుంటున్నారని, అది సులభమైన పని అని జగన్ తెలిపారు. విలేఖరి కృష్ణ లేదా ఇక్కడున్న రవికి చెప్పినా రెడ్ బుక్ నిర్వహిస్తారకని, అదేం పెద్ద ఘనకార్యం కాదు, గొప్ప పనికాదని జగన్ చెప్పారు. ఆ తర్వాత ఆ రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకుని వాళ్లను ఇరికించడం, వాళ్ల ఇళ్లను ధ్వంసం చేయడం, వాళ్ల ఆస్తులను ధ్వంసం చేయడం, వాళ్లపై దొంగ కేసులు పెట్టడం, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం చంద్రబాబు పాలనలా ఉంటుందని గుర్తు చేశారు.

ముందే తెలిసీ అలర్ట్ కాలేదు
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో నిమగ్నం అయ్యి, పరిపాలన గాలికి వదిలేశాడని జగన్ మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం తుపాన్ వస్తోందన్న సంకేతం చంద్రబాబుకు ముందే తెలుసన్న జగన్.. అలర్ట్ వచ్చినా, బుధవారం, గురువారం, శుక్రవారం మధ్యాహ్నం వరకు సమయం ఉన్నా ప్రజల మీద, వారి కష్టాల మీద ధ్యాస పెట్టలేని ఆక్షేపించారు. ప్రజలను చంద్రబాబు గాలికి వదిలేశాడని దుయ్యబట్టారు.

ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోలేదు
అలర్ట్ వచ్చిన రోజే రివ్యూ మీటింగ్ తీసుకుని ఉండాల్సిందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా నీళ్లు వస్తున్నాయని తెలుసని, కానీ రెవెన్యూ, ఇరిగేషన్, హోం, చీఫ్ సెక్రటరీలతో బాబు రివ్యూ చేయలేదన్నారు. దీంతో కలెక్టర్లు చేయాల్సిన పని చేయలేకపోయారన్నారు. ఇరిగేషన్ సెక్రటరీ శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో కనీసం ప్రతి డ్యాములో కనీసం 25-30 టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి మొత్తం కనీసం 80-90 టీఎంసీల మేరకు మొత్తం తగ్గించి ఒక ఫ్లడ్ కుషన్ నిర్వహించేవాడన్నారు. దాని వల్ల పైనుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కుషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపి ఉండొచ్చన్నారు.

రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసేవాడని, ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా? లేదా? ఎక్కడున్నాయి?ఎక్కడ పెట్టాలి? అనే ఏర్పాట్లు పర్యవేక్షించేవాడన్నారు. హోం సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్లందరికీ సమాచారం ఇచ్చి తుపాన్ రాబోతోందని చెప్పి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేయించేవాడన్నారు. ఇవన్నీ చేయకపోవడం వల్ల చివరకు తన ఇంటిని రక్షించుకునేందుకు ప్రజలకు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత బుడమేరులో గేట్లు ఎత్తి విజయవాడలోకి నీళ్లను పూర్తిగా పంపారని గుర్తు చేశారు. ఈ దుశ్చర్యకు ఏకంగా 60 మందికి పైచిలుకు చనిపోయారని, ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చన్నారు. ఇంతకు ముందు తుపాన్లు వచ్చినప్పుడు ఇలా 60 మందికిపైగా ఎప్పుడైనా చనిపోయారా? అని జగన్ ప్రశ్నించారు. ఇది చంద్రబాబు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు మీద నెగ్లిజెన్స్ కేసు ఎందుకు నమోదు చేయకూడదు? అని జగన్ నిలదీశారు.

బోట్లకు ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది?
చంద్రబాబు బోట్ల గురించి మాట్లాడుతున్నారని, ఈ బోట్లన్నీ ఎవరివి? ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు లేవా? ఈ బోట్లు గత నాలుగు నెలలుగా చంద్రబాబుతో కలిసి ఇసుక దోపిడీలో బోట్ల ఓనర్లందరూ భాగస్వాములయ్యారని జగన్ గుర్తు చేశారు. ఉషాద్రి అనే మనిషి చంద్రబాబుతో, లోకేష్ తో కలిసి దిగిన ఫొటోలు కనిపిస్తున్నాయని, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరాం అనే వ్యక్తి సోదరుడి కుమారుడు కాదా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలూరి చిన్నా అనే వ్యక్తి ఎవరు? తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధం ఏమిటి? ఇంత మంది, బోట్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వారివే కనిపిస్తుంటే.. ఈ బోట్లు వరద కారణంగా ప్రకాశం బ్యారేజీకి కొట్టుకుని వస్తే దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. వరదలను డైవర్ట్ చేయాలని వక్రభాష్యం చెబుతూ వేలు ప్రతిపక్షం వైపు ఎత్తి చూపిస్తున్నారని మండిపడ్డారు.

ఎల్లో మీడియా దుర్మార్గపు రాతలు
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇవన్నీ కూడా గోబెల్స్ మాదిరిగా చంద్రబాబును మోస్తున్నాయన్న జగన్.. ఇందుకు చిన్న ఉదాహరణ చెప్పారు. ఈరోజు ఈనాడులో.. రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట.. అని ఫ్రంట్ పేజీలో స్టోరీ రాశారన్నారు. చంద్రబాబుకు వర్షం ఎంత పడుతోందో తెలియడం లేదంట.. ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయట.. చంద్రబాబు వచ్చాక ఇప్పుడు మరమ్మతులు చేయిస్తున్నారట.. అన్నారు. ఇంతటి దుర్మార్గమైన రాతలు రాస్తున్న వీళ్లు మనుషులేనా? అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పాత విధానంలో రెయిన్ గేజ్ మీటర్లు ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయాయని, వాటి స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు 1599 రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయన్నారు. 2014 నుంచి కూడా ఉన్నాయని, వాటిని మరింత బలపరుస్తూ మరో 450 ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబు ఆరోజు వరదలు వచ్చినప్పుడు.. జి.కొండూరులో 42 సెం.మీ., విజయవాడ సెంట్రల్ లో 30 సెం.మీ. అని ఈ డేటా చెప్పగలిగాడన్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే రైతులకు ఇన్సూరెన్స్ వస్తోందని, ఈ క్రాపింగ్ జరుగుతోందన్నారు. వరదల టాపిక్ డైవర్ట్ చేసేందుకు సిగ్గులేని రాతలు రాస్తున్నారన్నారు.

ఎవరూ రాకూడదని కుట్రలు..
పెదకూరపాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శంకర్రావు వరదల విపత్తు వల్ల జరిగిన నష్టంలో పాలు పంచుకుంటూ రైతులకు, ప్రజలకు తోడుగా ఉండేందుకు బయల్దేరుతుంటే అడ్డగించి కారును పగలగొట్టారని జగన్ మండిపడ్డారు. తాను వరదబాధితులను చూడకూడదట.. వరద బాధితులను పరామర్శించకూడదట.. ఇలా ఎవరూ పోకూడదట.. చూడకూడదు.. మాట్లాడకూడదు.. అనే తీరులో చంద్రబాబు తప్పిదాలు బయటకు రాకూడదనుకుంటున్నారని మండిపడ్డారు. ఇవన్నీ తాత్కాలికమేనన్న జగన్.. నష్టం జరిగింది, కష్టం వచ్చింది ప్రజలకు అని, దెబ్బ తగిలింది, నొప్పి కలిగేది ప్రజలకు అని చెప్పారు. ఆ ప్రజలు చంద్రబాబు చేస్తున్న ఈ తప్పులను ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతున్నారని, శిశుపాలుని పాపాల మాదిరిగా మీ 100 తప్పులు కూడా వేగంగా ముందుకు అడుగులు పడుతున్నాయన్నారు. మీరు, మీ పార్టీ భూస్థాపితం అయిపోయే రోజులు కూడా త్వరలోనే వస్తున్నాయన్నారు.

గతంలో మార్కెట్ యార్డు చైర్మన్ గా పని చేసిన సాంబిరెడ్డి కారు ఆపి, తన కాళ్లు, చేతులపై రాడ్లతో కొట్టి.. చనిపోయాడు అని వదిలేసి వెళ్లారన్నారు. సాంబిరెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్నానన్నారు. ఎవరూ జెండా పట్టుకోకూడదు, ప్రజలు ఎవరూ నిలదీయకూడదన్నది వారి ఉద్దేశమన్నారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ తప్పుడు అబద్ధాలు చెప్పాడని, అవన్నీ ఇప్పుడు మోసం అయ్యాయన్నారు. మోసం లో నుంచి ప్రజలు కోపంతో బయటకు రోడ్ల మీదకు రాకూడదని, వైయస్సార్ సీపీ శ్రేణులు ప్రజలకు మద్దతు పలుకుతూ రాకూడదని ఈ మాదిరిగా దుర్మార్గపు అఘాయిత్యాల పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.

సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి?
’’మూడున్నర నెలలు దాటుతోంది. మీ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమయ్యాయి? ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి, వైయస్సార్ సీపీ ప్రభుత్వం ఉంటే రైతులందరికీ ఈపాటికే రైతు భరోసా సొమ్ము పడి ఉండేది. రైతులందరికీ ఉచితంగా ఇన్సూరెన్స్ అంది ఉండేది. విపత్తులు వచ్చి ఇంత పంట నష్టం జరుగుతోంది. ఎక్కడైనా ఒక్క గ్రామ సచివాలయంలోగానీ, కనీసం గ్రామ సచివాలయంలో లిస్టులు పెట్టి సోషల్ ఆడిట్ చేసి ఎవరికైనా ఇంకా మిగిలిపోయి ఉన్నారా? అందరికీ వచ్చిందా? అన్ని ఊర్లూ నమోదయ్యాయా? అని చూసే కార్యక్రమం కనీసం జరుగుతోందా? లేదా? సోషల్ ఆడిట్లు గాలికి ఎగిరిపోయాయి. గ్రామ సచివాలయంలో పారదర్శకంగా లిస్టులు పెట్టే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. రానివాళ్లు ఎవరైనా ఉంటే నమోదు చేసుకోండి అనే ప్రక్రియ గాలికి ఎగిరిపోయింది. ఈరోజు రైతులకు పెట్టుబడి సహాయం లేదు, ఉచిత ఇన్సూరెన్స్ లేదు. ఈ క్రాప్ లేదు. ఇలాంటి విపత్తు వస్తే కనీసం రైతులను పారదర్శకంగా ఆదుకునే కార్యక్రమం కూడా లేదు.’’ అని జగన్ అన్నారు.

పడకేసిన ఆరోగ్యశ్రీ
’’మామూలుగా జనవరిలో ఏదైనా ఆస్పత్రి బిల్స్ వస్తే ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రాసెస్ చేసి మార్చిలో బిల్స్ ఇస్తారు. మార్చి 16న కోడ్ వచ్చింది. ఇక అంతే. జనవరి నుంచి ఇప్పటి దాకా 2 వేల కోట్ల పైచిలుకు దాటాయి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల బిల్లులు. ఇంత వరకు ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్య ఆసరాను అటకెక్కించారు. 104, 108 ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడం లేదంటున్నారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు వైయస్సార్ సీపీ ప్రభుత్వం కట్టడం మొదలు పెట్టి అందులో 5 అప్పటికే పూర్తి చేసేసి, ఆ 5 కాలేజీల్లో సీట్లు తెచ్చుకుని, మిగిలిన 5 కాలేజీల్లో ఇప్పుడు సీట్లు తెచ్చుకునే దాని కోసం అన్ని వసతులూ క్రియేట్ చేసి పెడితే, చంద్రబాబు ఏం చేస్తున్నాడు? డబ్బుల కోసం మెడికల్ కాలేజీలను స్కాముల కింద మార్చేసి తనకు కావాల్సిన వాళ్ల కోసం మెడికల్ కాలేజీలను అమ్మేసే కార్యక్రమం చేస్తున్నాడు. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రతి మెడికల్ కాలేజీ, ప్రతి గవర్నమెంట్ ఆస్పత్రిలోనూ ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు ఉండేట్టుగా తీసుకొస్తే ఈరోజు మళ్లీ మందుల కొరత, నాడు నేడు ఆగిపోయింది.’’ అన్నారు.

విద్యాదీవెన పెండింగ్
జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ క్వార్టర్లకు సంబంధించిన విద్యాదీవెన సొమ్ము పెండింగ్ పెట్టారన్నారు. అదే వైయస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకోసారి, విద్యాదీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలో, పిల్లాడు, పాప ఉమ్మడి ఖాతాలో నేరుగా పడిపోయేదన్నారు. వసతి దీవెన కూడా ఎగరగొట్టేశారన్నారు. అమ్మ ఒడి అన్నది గాలికి వదిలేశారన్నారు. గోరుముద్ద చంద్రబాబు ప్రభుత్వంలో తినలేక ధర్నాలు చేస్తూ ఆస్పత్రులకు చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. బడుల్లో ఇంగ్లీషు మీడియం గాలికొదిలేశారని, మూడో తరగతి నుంచి పీరియడ్ గా పిల్లలకు పెడుతూ ఇంగ్లీషులో తర్ఫీదు ఇచ్చే కార్యక్రమం వైయస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తే ఈరోజు టోఫెల్ క్లాసులను పూర్తిగా ఎత్తేశారన్నారు.

డోర్ డెలివరీ లేదు
’’వైయస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, పేదల జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పథకం డోర్ డెలివరీ జరిగేది. పెన్షన్ ఇంటికే వచ్చేది. రేషన్ ఇంటికే వచ్చేది. ఈరోజు పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చింది. రేషన్ ఇంటికి రావడం దేవుడెరుగు.. వస్తే చాలు అన్నట్టు తయారైంది. ఇంటి వద్దకే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలింది. వాలంటీర్లను మోసం చేశారు. సచివాలయ సిబ్బందిని ఇష్టమొచ్చినట్లుగా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ ఫర్లు చేస్తున్నారు.’’ అని జగన్ మండిపడ్డారు.

సూపర్ సిక్సా? అంటే ఏమిటి?
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే.. సూపర్ సిక్సా.. సూపర్ సెవెనా? అంటే ఏమిటి నాకు గుర్తు లేదే? అన చంద్రబాబు అంటున్నాడని జగన్ ఎద్దేవా చేశారు. ’’ఎన్నికలప్పుడు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ ప్రచారంలో అన్న మాటలు ఏమిటి.. నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 15 వేలు అన్నారు. ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చిదంటే, వారితో పాటు చిన్నమ్మలో పెద్దమ్మలో బయటకు వచ్చారంటే మీకు 18 వేలు, మీకు 18 వేలు అనేవారు. ఇంట్లో నుంచి 50 ఏళ్ల పైచిలుకు వయసున్న మహిళ బయటకొస్తే జగనన్న చేయూత కింద ఇచ్చింది కేవలం 18 వేలే, చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి 48 వేలు ఇస్తాడు మీకు సంతోషమేనా అనేవాడు. ఇంట్లోంచి 20 ఏళ్ల పిల్లాడు బయటకొస్తే నీకు నెలకు రూ.3 వేలు అనేవాడు. ఇంట్లో నుంచి కండుకవా రైతు బయటకొస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా అనేవారు.’’ అని ఎద్దేవా చేశారు.

క్షమాపణలు చెప్పండి..
’’చంద్రబాబూ చేసిన తప్పులు ఒప్పుకోండి.. ప్రజలను క్షమాపణ అడగండి.. ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయండి. ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు. వేగంగా మీ పాపాలు పండుతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ రాని పరిస్థితిలోకి పోతుందన్నది ఇదే సందర్భంగా తెలియజేస్తున్నా.’’ అని జగన్ హెచ్చరించారు.

ఇవీ చదవండి: Chandrababu Naidu: వైయస్ జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
YS Jagan: రేపు గుంటూరులో వైయస్ జగన్ పర్యటన
Vinayaka Chaviti: తెలుగు వారికి వైయస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు
YS Jagan: ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్.. ఇంత నిర్లక్ష్యమా? : వైయస్ జగన్
YS Jagan: వక్ఫ్ బిల్లుకు మేం వ్యతిరేకం.. వైయస్ జగన్ క్లారిటీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు