Ambati Rambabu fire on CBN: వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. వ్యవసాయం, రైతుల గురించి, వారి కష్టాల గురించి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సీఎం జగన్ పాలనలో కరువు మండలాలు ప్రకటించే అవసరం లేకుండా పోయిందని స్పష్టం చేశారు అంబటి. (Ambati Rambabu fire on CBN)
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధి గా పడుతున్నాయని మంత్రి అంబటి పేర్కొన్నారు. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయని తెలిపారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలు, అవాస్తవాలే అన్నారు. తనకు లాభం వచ్చిన ప్రాజెక్టులనే చంద్రబాబు కట్టారన్నారు. ప్రాజెక్టులను తన దోపిడీ కోసం చంద్రబాబు వాడుకున్నారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు చెప్పేవి అన్ని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉన్నారని, ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు.
ప్రాజెక్టులపై తమ ప్రభుత్వం రూ. 27,394 కోట్లు ఖర్చు పెట్టిందని అంబటి రాంబాబు తెలిపారు. నీరు – చెట్టు పేరుతో టీడీపీ నేతలు రూ. 13 వేల కోట్లు మింగేశారని అంబటి ఆరోపించారు. ఈ ఐదేళ్లు వర్షాలు సమృద్ధిగా కురిశాయని గుర్తు చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ను ఉపయోగించాల్సిన అవసరం రాలేదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో రూ.257 కోట్లు కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు కు అనుమతులే లేవన్నారు. అశాస్త్రీయంగా రూ. 1600 కోట్లు వృధా చేశారని మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
Read Also : Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ కోసం అదనపు నిధులకు అభ్యంతరం లేదు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
కళ్లున్న కబోది చంద్రబాబు : మంత్రి పెద్దిరెడ్డి
చంద్రబాబు కళ్లున్న కబోది అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. ఎవరి పాలనలో రాయలసీమలో ప్రాజెక్ట్ ల నిర్మాణాలు జరిగాయో అందరికి తెలుసని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నోటి వెంట పచ్చి అబద్దాలు వస్తున్నాయన్నారు. రాయలసీమ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు అన్నారు. వైఎస్సార్ పాలనలో హంద్రీనీవా పనులు 95 శాతం పూర్తయ్యాయన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. కుప్పంకు నీళ్లు తీసుకురాలేదన్నారు. త్వరలోనే తాము కుప్పంకు సాగునీరు అందిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు తిరుపతిలో మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుది 420 విజన్ అని ఎద్దేవా చేశారు. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం పథకాలు మీరేందుకు తేలేదు ? అని ప్రశ్నించారు. రాజధానిలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే ఓర్వలేకపోతున్నారన్నారు. టీడీపీ హాయాంలోనే విచ్చలవిడిగా గంజాయి సాగైందని ఆరోపించారు. పుత్తూరులో టీడీపీ నేతలు గంజాయి విక్రయించి జైలుకెళ్లలేదా ? అని నిలదీశారు. గంజాయి సాగు గురించి టీడీపీ వాళ్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గంజాయి సాగును సీఎం జగన్ అణచివేస్తున్నారని మంత్రి రోజా స్పష్టం చేశారు.
Read Also : TTD Chairman: టీటీడీ చైర్మన్ రేసులో భూమన? సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి