HomeAndhra PradeshNandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

Nandigam Suresh: ఏపీలో వైయస్సార్ సీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేష్‌ను హైదరాబాద్‌లో మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైంది.

నందిగం సురేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను నిన్న హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్టు చేసేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు నిన్ననే హైదరాబాద్ కు నందిగం సురేష్ వెళ్లారు. పారిపోవడానికి ప్రయత్నించాడంటూ నందిగం సురేష్ పై వార్తలు వచ్చాయి. మంగళగిరి పోలీసులు సురేష్ ఉన్న ప్రాంతానికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతన్ని మంగళగిరికి తరలించారు.

తన భర్త అరెస్టుపై నందిగం సురేష్ భార్య రియాక్ట్ అయ్యారు. తన భర్త కి ఏమైనా జరిగితే ఆ బాధ్యత సీఎం చంద్రబాబునాయుడుదేనని ఆరోపించారు. వైయస్ జగన్ తమపై ప్రేమ చూపించడం చంద్రబాబుకు నచ్చలేదన్నారు. హైదరాబాద్ లో ఆస్పత్రికి వెళ్తే అక్రమంగా తన భర్తను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తపై అక్రమ కేసులు బనాయించేందుకు సిద్ధమవుతున్నారని, మొదట చంద్రబాబునే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా చేర్చిన విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురామ్, దేవినేని అవినాశ్ లను నిందితులుగా చేర్చారు. వీరిని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉంది.

Read also: Viswam: కొట్టారు.. తీసుకున్నాం.. రేపు మాకూ టైమ్ వస్తుంది.. మేమూ కొడతాం!
Devara: దేవర నుంచి మరో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌తో జాన్వీ పోటీ పడిందా?
YS Jagan: విజయవాడ మునగడానికి కారణం చంద్రబాబే.. మరోసారి జగన్ ఫైర్
Girls: చిన్నవయసులోనే బాలికల్లో మార్పులకు కారణం ఏంటి?
YS Jagan: ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్.. ఇంత నిర్లక్ష్యమా? : వైయస్ జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు