Koneti Adimulam: ఏపీలో రాజకీయ పార్టీలు ఒకరిపై మరికొరు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ టీడీపీ (TDP), విపక్ష వైయస్సార్ సీపీ (YSRCP) నేతల వీడియోలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల వైసీపీ నేతల అడల్ట్ వీడియోలు టీడీపీ నేతలు, వారి సోషల్ మీడియా బయట పెట్టగా, తాజాగా చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (Koneti Adimulam) సెక్స్ వీడియో బయటకొచ్చింది.
వైసీపీ నేతలు ఎమ్మెల్సీ అనంతబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావు, తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఇలా చాలా మందికి చెందిన కాల్ రికార్డులు, అక్రమ సంబంధాల గుట్టు వీడియోలు, ఆడియోలను టీడీపీ నేతలు, వారి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేశారు. అసలు వైసీపీ (YCP) అంటేనే వైకామ పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో ఆ పార్టీనేతలు ధ్వజమెత్తారు. దీనికి కౌంటర్ ఇచ్చుకోలేక వైసీపీ బాగా సతమతం అయ్యింది.
తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. (TDP MLA Sex Video) గతంలో ఓ మహిళతో హోటల్ రూములో చేసుకున్న ఘనకార్యం నేరుగా వీడియో రూపంలో బయటకొచ్చింది. సదరు మహిళే ఈ విషయాన్ని బయట పెట్టింది. అది కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించారు. టీడీపీ కార్యకర్తగా ఎన్నికల్లో ఆయన తరఫున ప్రచారం చేయగా, తన ఫోన్ నంబర్ తీసుకుని పలుమార్లు కాల్ చేశాడని ఆమె తెలిపింది.
https://twitter.com/msnaidu687/status/1831599171054530907
జూలై 6న తిరుపతిలోని ఓ రూముకు పిలిచి తనపై బలాత్కారం చేశాడని, మళ్లీ రాకపోతే చంపేస్తానని బెదిరించాడంటూ ఆమె వాపోయింది. ఈ విషయం తన భర్తకు చెప్పానని, ఆయన పెన్ కెమెరా ఇవ్వడంతో ఆగస్టు 10న వీడియో రికార్డ్ చేశానని బాధితురాలు వెల్లడించింది.
ఈలోగా సదరు వీడియో సోషల్ మీడియాల్లో విత్ అవుట్ సెన్సార్ విపరీతంగా సర్క్యులేట్ అయిపోయింది. దీంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ మధ్యాహ్నానికల్లా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు.
రాజీనామా చేయాలి
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తక్షణమే ఆది మూలం ను పదవికి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని బాధిత మహిళ చెబుతోందని ఐద్వా సాయిలక్ష్మి అన్నారు. మీడియా ముందుకు వచ్చిన తర్వాతనే పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేసిందని, ఇదేనా ఒక మహిళకు మీ పార్టీ ఇచ్చే గౌరవం? ఇలాంటి వాళ్ళే మీదగ్గర ఉన్నారా అంటూ సాయిలక్ష్మి ప్రశ్నలు గుప్పించారు.
Read also: Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్
Viswam: కొట్టారు.. తీసుకున్నాం.. రేపు మాకూ టైమ్ వస్తుంది.. మేమూ కొడతాం!
Devara: దేవర నుంచి మరో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌తో జాన్వీ పోటీ పడిందా?
YS Jagan: విజయవాడ మునగడానికి కారణం చంద్రబాబే.. మరోసారి జగన్ ఫైర్
YS Jagan: ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్.. ఇంత నిర్లక్ష్యమా? : వైయస్ జగన్
