Viswam: ’’కొట్టాడు.. తీసుకున్నాం.. రేపు మాకూ టైమ్ వస్తుంది.. మేమూ కొడతాం..’’ ఇది ఏపీలో ఒకప్పుడు చాలా పాపులర్ డైలాగ్. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్.. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో తన పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యాక.. మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలివి. అన్నట్లుగానే ఆ తర్వాత 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఆయన 151 సీట్లు గెలిచి చూపించారు.
ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ఆ డైలాగ్ మార్మోగుతోంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం విశ్వం (Viswam). ఈ మూవీ టీజర్ లేటెస్ట్ గా విడుదలైంది. ఈ చిత్రంలో వైయస్ జగన్ డైలాగ్ హీరో గోపీచంద్ నోట యాజ్ ఇటీజ్ గా రావడం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో, సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
శ్రీను వైట్ల అంటేనే కామెడీ జానర్ ఉన్న చిత్రాలతో హిట్ కొడతాడని పేరుంది. గతంలో రవితేజ కాంబోలో వచ్చిన వెంకీ చిత్రం కామెడీతో అలరించింది. మరిన్ని చిత్రాలు ఈ కోవలోనే హిట్ అందుకున్నాయి. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా వచ్చిన ఢీ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్ షా, మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు, రవితేజ నటించిన దుబాయ్ శీను, రామ్ హీరోగా వచ్చిన రెడీ లాంటి చిత్రాలు శ్రీను వైట్ల హిట్ లిస్టులో ఉన్నాయి.
అయితే, కామెడీ కుదరక ఫ్లాపులు అయిన చిత్రాలు కూడా శ్రీను వైట్ల జాబితాలో ఉన్నాయి. ఈ కోవలో కింగ్, ఆగడు, బ్రూస్ లీ లాంటివి ఉన్నాయి. ఇప్పుడు గోపీచంద్ తో కలిసి విశ్వం సినిమాను తెరకెక్కిస్తున్నారు శ్రీను వైట్ల. ఈ సినిమాలో ఏపీ మాజీ సీఎం జగన్ డైలాగ్ ను ఎందుకు పెట్టారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి: Devara: దేవర నుంచి మరో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌తో జాన్వీ పోటీ పడిందా?
YS Jagan: విజయవాడ మునగడానికి కారణం చంద్రబాబే.. మరోసారి జగన్ ఫైర్
Girls: చిన్నవయసులోనే బాలికల్లో మార్పులకు కారణం ఏంటి?
Mister Bachchan Review: మిస్టర్ బచ్చన్ రివ్యూ.. 2011-12 తర్వాత సినిమాలు రాలేదా?
Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి.. రెడ్ డ్రెస్‌లో ఘాటు పోజులు
