HomeAndhra PradeshAshwini Vaishnaw: ఏపీకి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్ న్యూస్..

Ashwini Vaishnaw: ఏపీకి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్ న్యూస్..

Ashwini Vaishnaw: ఏపీకి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్ న్యూస్ చెప్పారు. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ వస్తుందని, 2,596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్ అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక హబ్ కోసం రూ.2,137 కోట్లు వ్యయం చేస్తామన్నారు. కొప్పర్తి పారిశ్రామిక హబ్ లో 54 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.

’’కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్ వస్తుంది. 2,621 ఎకరాల్లో ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తాం. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ ప్రాజెక్టు వ్యయం రూ.2,786 కోట్లు ఖర్చు చేస్తాం. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ లో రూ.12 వేల కోట్లు పెట్టుబడి. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ లో 45వేలమందికి ఉపాధి లభిస్తుంది.

ఉత్పత్తి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఉత్పత్తి రంగానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయి. భారత్ లో ఉత్పత్తి చేసేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం రూ.28,602 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఉత్పత్తి రంగం అభివృద్ధితో భారత్ లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. జంషెడ్ పూర్, అసన్ పోల్ కారిడార్ ను అభివృద్ధి చేస్తాం. ఝూర్ఖండ్, ఛత్తీస్ గఢ్ లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి.’’ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

Read also: AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలకు ఆమోదం
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. బీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్, బీజేపీ కొట్లాటేందిరబై..!
AP BJP: నామినేటెడ్ పదవులపై టీడీపీ-బీజేపీ మధ్య పేచీ
Blood Tests: మీకు 25 ఏళ్లు దాటాయా? అయితే ఈ 6 టెస్టులు తప్పనిసరి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు