AP Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ నేడు భేటీ అయ్యింది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసిన మంత్రివర్గం.. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సెబ్)ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా 21.86లక్షల పాస్ పుస్తకాలు ముద్రించాలని నిర్ణయించారు. 22ఏభూముల వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణ, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు ఆమోదం తెలిపింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగింపునకు ఆమోదం తెలిపారు. 2,774 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ పోస్ (EPOS) మెషీన్లు ఏర్పాటు చేయనున్నారు. EPOS మెషీన్ల కొనుగోలుకు రూ.11.51 కోట్ల నిధులు మంజూరు చేయనున్నారు. అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించాలని నిర్ణయించారు.
Read also: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. బీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్, బీజేపీ కొట్లాటేందిరబై..!
AP BJP: నామినేటెడ్ పదవులపై టీడీపీ-బీజేపీ మధ్య పేచీ
Galla Madhavi: గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే భర్తపై అట్రాసిటీ కేసు!
Problems: అష్టకష్టాలు అంటే ఏమిటి? అవి ఎలా ఉంటాయో తెలుసా?
