HomeTelanganaMLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. బీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్, బీజేపీ కొట్లాటేందిరబై..!

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. బీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్, బీజేపీ కొట్లాటేందిరబై..!

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితకు ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె ఇరుక్కుని 5 నెలలుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. పలుమార్లు ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో బెయిల్ నిరాకరణకు గురి అయిన నేపథ్యంలో ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ మంజూరైన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలంతా ఢిల్లీలో సంబరాలు చేసుకున్నారు. ఇటు రాష్ట్రంలో ఆ పార్టీ శ్రేణులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

బీఆర్ఎస్ విలీనం అంటూ..
మరోవైపు కవితకు బెయిల్ రావడంపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పలు రకాల కామెంట్లు చేయడం హైలెట్ అయ్యింది. కవితకు బెయిల్ రావడానికి కారణం బీజేపీతో లాలూచీ పడటమేనని కాంగ్రెస్ నేతలు, కాదు కాదు.. ఆమెకు బెయిల్ వచ్చిందంటే కారణం కాంగ్రెస్ మాత్రమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అని బీజేపీ నేతలు, కేసీఆర్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సైతం ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

ఇవీ చదవండి: Venu swamy: వేణు స్వామి పునరుద్ఘాటన.. మరోసారి ఏపీలో వచ్చేది జగనే! త్వరలో కేటీఆర్ జైలుకు!
MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం
BRS Party: బీఆర్‌ఎస్‌ కొంప ముంచిన ప్రజా వ్యతిరేకత.. ఓటమికి కారణాలేంటి?
Telangana Politics: బీఆర్‌ఎస్‌పై మోదీ ఫైర్‌.. కేసీఆర్‌ రియాక్షన్‌ లేదెందుకు? కాంగ్రెస్‌ ఎదుగుదలపై ఫోకస్‌ పెంచారా? వాట్‌ నెక్స్ట్‌?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు