Brother’s Marriage: హిందూ సంప్రదాయంలో అనేక కట్టుబాట్లు, పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా వివాహం విషయంలో కొన్ని ఆచారాలు హిందువులు అనుసరిస్తారు. ఇవి అనాదిగా వస్తున్న సంప్రదాయం. ముఖ్యంగా అన్నదమ్ములు ఒకేసారి పెళ్లి (Brother’s Marriage) చేసుకోరాదని చెబుతుంటారు. ఒకే సంవత్సరంలో అన్నదమ్ముల పెళ్లిళ్లపై (Brother’s Marriage) చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. ఒకేసారి, ఒకే సంవత్సరంలో అన్నదమ్ముల పెళ్లిళ్లు చేయడం వల్ల ఏమైనా దోషాలు ఏర్పడతాయా? ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతుంటాయి.
ముఖ్యంగా అన్నదమ్ముల వ్యవహారంలో కొందరు పట్టింపులకు పోతుంటారు. మరికొందరు ప్రేమ వ్యవహారలకు సంబంధించి పెద్దల మాటను పెడచెవినపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి తరుణంలోనే అన్నదమ్ములిద్దరూ ఒకే సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం జరుగుతుంటాయి. వంశంలో ఏమైనా దోషాలు కలుగుతాయేమో అని తల్లిదండ్రులు, పెద్దలు, కుటుంబీకులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేస్తుంటారు.
ఇందుకు నిపుణులు సమాధానాలు చెబుతున్నారు. ఒకే సంవత్సరంలో అన్నదమ్ముల వివాహాలు చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు, పరిహారాలు పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారతీయ సంప్రదాయంలో వివాహం సందర్భంగా స్నాతక వ్రతం నిర్వహిస్తుంటారు. స్నాతకోత్సవం ప్రక్రియ ప్రకారం ఒకే సంవత్సరం వివాహం చేయొద్దని చెబుతుంటారు. వంశాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఈ నియమం పాటిస్తారని నమ్మకం. అయితే, కొన్ని తప్పనిసరి సందర్భాలు జరుగుతుంటాయి.
ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో స్వయంగా తల్లిదండ్రులే ఒకే సంవత్సరంలో అన్నదమ్ములకు పెళ్లి చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో దోషాలు ఏర్పడకుండా దీనికి పరిష్కారంగా అన్నదమ్ముల వివాహం గురించి పండితులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. సోదరుల వివాహం మధ్యలో ఏడాది వ్యవధి ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేస్తున్నారు. సంవత్సరం చివరిలో ఒకరికి, ఉగాదితో ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో మరొకరికి చేయొచ్చని స్పష్టం చేస్తున్నారు. ఒకే సంవత్సరంలో వివాహం చేయాలనుకునేవారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు. అయితే, ఆడ పిల్లల విషయంలో ఇలాంటి నిబంధనలేమీ లేవని పండితులు స్పష్టీకరిస్తున్నారు.
ఇద్దరు అన్నదమ్ములకు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు వారు కవలలు అయినా వివాహం నిషిద్ధమని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కర్మ వసాన కుటుంబ కలహాలు జరిగి ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు బద్ద శత్రువులుగా మారే ప్రమాదం కూడా పొంచి ఉందని పెద్దలు హెచ్చరిస్తున్నారు. అయితే, నేటి కాలంలో లవ్ మ్యారేజీలు ఎక్కువ చేసుకుంటున్నారు. దీంతో అన్నదమ్ములు ఒకేసారి పెళ్లి చేసుకోవడం, కవలలు పెళ్లిళ్లు చేసుకోవడం, సిస్టర్స్ ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయడం లాంటివి పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
ఇది వరకు చాలా వివాహాలు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లకు ఒకేసారి వేర్వేరు పెళ్లిళ్లు చేశారు. అయితే, అవేవి సవ్యంగా సంసారాలు సాగలేదని పెద్దలు చెబుతున్నారు. భార్యా భర్తల్లో ఎవరో ఒకరు చనిపోవడం, గర్భంతో ఉండగా వికటించడం, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం.. ఇలాంటివి సంభవిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒకే ఏడాదిలో అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఒకేసారి ఒకే ఆడ బిడ్డలు, అబ్బాయిలు అయినా సరే.. వేరే సంబంధాలు ఒకే సంవత్సరంలో ఒకేరోజు ఒకే ముహూర్తంలో చేసుకోరాదని హితవు పలుకుతున్నారు. ఇలా చేసుకున్న వారు ఎన్నో గొడవలు, చావులు చూసిన తర్వాతే పెద్దలు ఈ మాట చెప్పారని చెబుతున్నారు.
తప్పనిసరి పరిస్థితులు అయితే ఏం చేయాలి?
అయితే, ఇష్టపడిన సంబంధాలు, కుండమార్పిడి పెళ్లిళ్లు చేసుకోవడం తప్పనిసరి అయిన పరిస్థితులు, వేరే గత్యంతరం లేని పరిస్థితులు ఎదురైనప్పుడు పండితులను సంప్రదించి, పెద్దవాళ్లను అడిగి, పెళ్లి కొడుకులు, పెళ్లి కుమార్తెల జాతాకాలు చూపించాలి. వారు సూచించే పరిహారాలు, శాంతి ప్రక్రియలు, చేసుకొని ప్రొసీడ్ కావడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also : Wife and Husband Relationship: భార్యా భర్తల మధ్య నిందలు పెరిగాయా?