Vizag Love story: విశాఖపట్నం పరిధిలోని గోపాలపట్నంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆలస్యంగా బయటపడింది. ఇందులో సినీ ఫక్కీలో ట్విస్టులు వెలుగు చూశాయి. ఒకేసారి ఇద్దరు యువకులను యువతి ప్రేమించింది. అయితే మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా లవర్స్‌తో చనువుగా ఉంటుండటంతో అసలు కథ మొదలైంది. ఈ ఉదంతం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. (Vizag Love story)
విశాఖలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు పలువురు యువకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆదర్శనగర్‌కు చెందిన సీపాన సూర్యప్రకాష్‌రావుతో మొదట ఆమె లవ్ ట్రాక్ నడిపింది. అదే సమయంలో ఇందిరానగర్‌కు చెందిన లెంకా సాయికుమార్‌ను రహస్యంగా వివాహం చేసుకుంది. ఆమె సూర్యప్రకాష్‌తో చనువుగా ఉండడంతో సాయికుమార్‌కు అస్సలు నచ్చలేదు. మరోవైపు సాయికుమార్‌తో చనువుగా వ్యవహరించడం సూర్యప్రకాష్‌కూ మింగుడు పడలేదు.
ఈ నేపథ్యంలో వీరు ముగ్గురి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఒకరినొకరు వార్నింగులు కూడా ఇచ్చుకున్నారు. బాలిక ఆత్మహత్యకు రెండు రోజుల ముందు ఇద్దరు యువకులూ వేర్వేరు సమయాల్లో వచ్చినట్లు తేలింది. ఈ క్రమంలో ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకోవాలంటూ వారు అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన బాలిక.. మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సూర్య ప్రకాష్, సాయికుమార్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూశాయి. బాలికను ఆ ఇద్దరు యువకులూ ఒత్తిడికి గురి చేయడం వల్లే బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. విషయం తెలిసి భయపడిపోయిన సూర్యప్రకాష్ గోపాలపట్నం ఆర్‌ఆర్ క్యాబిన్ వద్ద శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఇక లంకా సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఇద్దరు ప్రియులు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఈ వ్యవహారం మూడు కుటుంబాల్లో విషాదానికి కారణం అయ్యింది. యువతి సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also : DGP on punganuru incident: పుంగనూరు ఘటనలో ఇప్పటి వరకు 80 మందిని అరెస్టు చేశాం : డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి