YS Jagan: శాసనసభ సమావేశాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కార్యక్రమాల షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం తెలిపింది. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం ప్రకటన వెలువరించింది. ఈనెల 21న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
ఇందులో భాగంగా మొదటగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈనెల 22కు బదులుగా ఈనెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు హాజరవుతారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రేపటి (జూన్ 19నాటి) పులివెందుల పర్యటనను శ్రీ వైయస్.జగన్మోహన్‌రెడ్డి వాయిదా వేసుకున్నారు.. అని ఆయన క్యాంపు కార్యాలయం వెల్లడించింది.
ఇవీ చదవండి: YS Jagan: రేపు పులివెందుల పర్యటనకు మాజీ సీఎం జగన్.. వాట్ నెక్స్ట్!
Prannoy Roy Interview with YS Jagan: వైయస్ జగన్‌తో ప్రణయ్ రాయ్ ఇంటర్వ్యూ.. అభివృద్ధి, మద్యం పాలసీపై క్లారిటీ!
Attack on CM Jagan: సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడికి బెయిల్
YS Jagan: నేడు విదేశీ పర్యటనకు సీఎం జగన్
