HomeAndhra PradeshYS Jagan: రేపు పులివెందుల పర్యటనకు మాజీ సీఎం జగన్.. వాట్ నెక్స్ట్!

YS Jagan: రేపు పులివెందుల పర్యటనకు మాజీ సీఎం జగన్.. వాట్ నెక్స్ట్!

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం జూన్ 19న 3 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరుతారు. సాయంత్రం 4 గంటల సమయంలో కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల చేరురుకుంటారు జగన్. మళ్లీ ఈనెల 21న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.

రెండు రోజులపాటు వైయస్సార్ జిల్లా పులివెందులలో ఆయన పర్యటన కొనసాగనుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన తర్వాత రెండు రోజులకే తేరుకున్నారు వైసీపీ అధినేత. వరుస సమావేశాలు నిర్వహిస్తూ కేడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత ఓడిపోయిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో వరుస సమావేశాలు నిర్వహించారు జగన్. తర్వాత ఎంపీలతోనూ భేటీ అయ్యారు. అందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేసిన రోజులను గుర్తు చేసుకున్న జగన్.. తనకు ఇప్పటికి పెద్ద వయసేమీ అయిపోలేదని, అదే ఉత్సాహంతో మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వెళ్దామని కేడర్ కు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని సంకేతాలు పంపారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా అయిన నేపథ్యంలో ఈ ఐదేళ్లూ పార్టీని కాపాడుకోవడం కత్తిమీద సామేనని విశ్లేషణలు వస్తున్న క్రమంలో కష్టాలు తమకు కొత్తేమీ కాదని, మళ్లీ ఇక్కడి నుంచి పైకి లేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు జగన్.

ఓడిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం వెళ్తున్నారు జగన్. కేడర్ ను కలుపుకొని పోలేదన్న అపవాదు మూటగట్టుకున్న నేపథ్యంలో ఇకనుంచి అయినా జగన్ వైఖరిలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. కార్యకర్తలు, నాయకులకు అండగా నిలవడం, ఎప్పటికప్పుడు వారితో మమేకం కావడం కోసం జగన్ ఇకపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారని కేడర్ ఆశిస్తున్నారు. పులివెందుల పర్యటన తర్వాత జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవీ చదవండి: Prannoy Roy Interview with YS Jagan: వైయస్ జగన్‌తో ప్రణయ్ రాయ్‌ ఇంటర్వ్యూ.. అభివృద్ధి, మద్యం పాలసీపై క్లారిటీ!
YS Jagan in Kadapa: కడపలో సీఎం జగన్ ఎమోషనల్‌.. షర్మిలపై కీలక వ్యాఖ్యలు!
YS Jagan in Kaikaluru: చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి: కైకలూరులో సీఎం జగన్
YS Jagan in Kalyanadurgam: మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చినది మీ బిడ్డ: కళ్యాణదుర్గంలో సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు