HomeAndhra PradeshYS Jagan: అసెంబ్లీలో ఓ మూలన జగన్.. మళ్లీ సున్నా నుంచి మొదలు....?

YS Jagan: అసెంబ్లీలో ఓ మూలన జగన్.. మళ్లీ సున్నా నుంచి మొదలు….?

YS Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు మరోసారి తన రాజకీయ జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నిల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడమే. అంతే కాదు.. ఏకంగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది వైయస్సార్ సీపీ. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జగన్ హాజరవుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా.. స్పీకర్ ఎదుట ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో జగన్ తప్పనిసరిగా తొలిరోజు హాజరవుతారనే సంకేతాలు వెలువడుతున్నాయి.

పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ కు ఇక ఈ ఐదేళ్లూ గడ్డు కాలమని చెప్పక తప్పదు. తాజాగా ఈవీఎంలపై సందేహాలు వెలుబుచ్చిన జగన్.. ఓడిన జూన్ 4వ తేదీన కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఎవరో అన్యాయం చేశారని అనేందుకు ఆధారాలు లేవంటూ కామెంట్ చేశారు. అయితే, ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈవీఎంల హ్యాకింగ్ నిజమేనంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

తాజాగా టెస్లా కార్ల అధినేత, ట్విటర్ ఓనర్ ఎలోన్ మస్క్ సైతం ఇదే ట్విటర్లో ట్వీట్ చేశారు. భారత్ లో ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని కామెంట్ చేశారు. బ్యాలెట్ పేపర్లతోనే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇక ఇండియా కూటమిది సైతం ఇదే బాట. అలాగే శివసేన, ఇతర ఛోటా మోటా పార్టీలు కూడా ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నాయి.

ఇదే విషయంపై గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం గతంలో కామెంట్లు చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈవీఎంలపై చంద్రబాబు, పవన్ కామెంట్లు, కాంగ్రెస్ నేతల కామెంట్లు, తాజాగా ఓడిన జగన్ కామెంట్లను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం తప్పక గెలవాలని, ఈవీఎంల గోల్ మాల్ ఉంటే తప్పనిసరిగా న్యాయం గెలవాలంటూ మాజీ సీఎం జగన్ ట్విటర్ లో ఇవాళ పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు, ప్రధానిగా మోదీ గెలవడానికి పలు రాష్ట్రాల్లో ఈవీఎంల మేనేజ్ మెంట్ లేదా కౌంటింగ్ వద్ద మేనేజ్ మెంట్, లేదా పోలింగ్ స్టేషన్లలో మేనేజ్ మెంట్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ ఖాయంగా గెలుస్తామన్న సీట్లలో ఒక శాతం ఓటు బ్యాంకు లేని వారు కూడా గెలవడం ఇక్కడ చర్చకు దారి తీసింది. ఏది ఏమైనా ఈ ఎన్నికల ఫలితాలపై పలువురికి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అవన్నీ కాలమే నివృత్తి చేయాలి మరి.

Read also: YS Jagan: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జగన్ షెడ్యూల్‌లో మార్పు
YS Jagan: రేపు పులివెందుల పర్యటనకు మాజీ సీఎం జగన్.. వాట్ నెక్స్ట్!
Prannoy Roy Interview with YS Jagan: వైయస్ జగన్‌తో ప్రణయ్ రాయ్‌ ఇంటర్వ్యూ.. అభివృద్ధి, మద్యం పాలసీపై క్లారిటీ!
Attack on CM Jagan: సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడికి బెయిల్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు