Attack on CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడిన వ్యక్తికి తాజాగా బెయిల్ మంజూరైంది. సీఎం జగన్ పై దాడి కేసులో ఏ-1 నిందితుడిగా సతీష్ ఉన్నాడు. రాయితో దాడి చేసిన కేసులో సతీష్ రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. నిందితుడు సతీష్ కు జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
నిందితుడి తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. నిన్న తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. ఇవాళ సతీష్ కు బెయిల్ మంజూరు చేసింది. శని, ఆదివారాల్లో పీఎస్ లో సంతకం చేయాలని కోర్టు ఆదేశం ఇచ్చింది.
రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నిందితుడు సతీశ్ ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి ఘటన జరిగిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: DBT Amount: మాట నిలబెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ
YS Jagan with I-Pac: 151 దాటేస్తాం.. వైయస్ జగన్ కాన్ఫిడెన్స్ ఇదీ
CM Jagan: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
YS Jagan in Pithapuram: పిఠాపురంలో సీఎం జగన్ మాస్ స్పీచ్.. ఇక్కడ చదవండి
YS Jagan in Chilakaluripeta: ఫ్యాన్ గుర్తుకు గుద్దితే బ్యాలెట్ బద్దలవ్వాలి.. చిలకలూరిపేటలో సీఎం జగన్
