HomeNationalRoads: రోడ్లపై గుంతలా? దానంతట అదే పూడుకుపోయే టెక్నాలజీ వచ్చేస్తోంది!

Roads: రోడ్లపై గుంతలా? దానంతట అదే పూడుకుపోయే టెక్నాలజీ వచ్చేస్తోంది!

Roads: మనదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న రహదారుల్లో గుంతల సమస్య నిత్యం వాహనదారులను వేధిస్తూనే ఉండటం మనం వార్తల్లో చదువుతుంటాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు గుంతలతో ఇబ్బందికరంగా దర్శనమిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు పాడవడం, ట్రాఫిక్‌ జామ్‌ వంటి లాంటి ఇక్కట్లు తప్పడం లేదు.

కొన్నిసార్లు వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ చాలా ఉన్నాయి. తాజాగా దీనికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిష్కారం వెతికేందుకు సన్నద్ధమైంది. రహదారిపై గుంత ఏర్పడినప్పుడు దానంతట అదే పూడుకుపోయే సాంకేతికతను తీసుకొచ్చేలా చూస్తున్నారు.

సాధారణంగా రహదారులపై ఏదైనా గుంత ఏర్పడితే మళ్లీ దాన్ని మనుషులు లేదా యంత్రాలతో పూడ్చాల్సిందే. ముఖ్యంగా వర్షాకాలంలో వస్తే ఈ గుంతల్లో నీరు నిలిచిపోయి రోడ్లు మరింత దెబ్బతింటాయి. అలా కాకుండా చిన్నపాటి గుంత లేదా పగుళ్లు ఏర్పడగానే దానంతట అదే పూడుకుపోయేందుకు రహదారుల నిర్మాణంలో సెల్ఫ్‌ హీలింగ్‌ మెటీరియల్‌ను వాడనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు వెల్లడించాయి.

స్టీల్‌ ఫైబర్స్‌, తారు కలిపిన పదార్థాన్ని ఇందులో వినియోగిస్తారట. గుంత ఏర్పడగానే తారు హీట్‌ అయిపోయి దానంతట అదే పూడుకుపోతుందని అధికారులు చెబుతున్నారు. కొన్ని జాతీయ రహదారులపై దీన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిశీలించి ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ఈ మెటీరియల్‌ను వాటం వల్ల ఎంతమేర ప్రయోజనం కలగనుంది? దానికయ్యే ఖర్చు ఎంత? వంటి వివరాలను త్వరలో తెలియజేయనున్నారు.

ఇవీ చదవండి: Motor Accidents Claims: రోడ్డు ప్రమాదాల క్లెయిమ్‌లు-లీగల్ పపెరస్పెక్టివ్ బెస్టు ప్రాక్టీసెస్‌.. తప్పక తెలుసుకోండి..
Suliyari: సుల్యారీలో ఆధునిక ప్రమాణాలతో స్కూల్‌.. కీలక ఒప్పందం ఖరారు
Darsi Road Accident : దర్శి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాగర్‌ కెనాల్‌లోకి పెళ్లి బస్సు.. ఏడుగురు దుర్మరణం
Pawan VS Dwarampudi: రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్తా.. తుక్కు తుక్కుగా ఓడిస్తా.. పవన్‌ వర్సెస్‌ ద్వారంపూడి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు