HomeLife StyleLavangam: రోజుకో లవంగం తింటే ఏమవుతుందో తెలుసా?

Lavangam: రోజుకో లవంగం తింటే ఏమవుతుందో తెలుసా?

Lavangam: వంటింట్లో ఉండే నిత్యావసర వస్తువుల్లో లవంగం ఒకటి. రోజుకో లవంగం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో అనేక రకాల సుగంధ ద్రవ్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వంటల్లో, అలాగే ఆయుర్వేద వైద్యంలో కూడా విరివిగా వాడతారు. వివిధ రకాల దినుసులు వంటలకు ప్రత్యేక రుచిని తెస్తాయి.

అయితే వీటిలోని మెడికల్ ప్రాపర్టీస్ కారణంగా అనారోగ్యాలు దరిచేరవని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లవంగాలతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలోని సమ్మేళనాలతో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. రోజూ ఒక లవంగం పలుకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

స్కిన్‌ కేర్
వేసవిలో అధిక వేడి, చెమట కారణంగా పలు రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. ఆహారంలో వీటిని చేర్చుకుంటే ఈ సీజన్‌లో ఎదురయ్యే చర్మ సమస్యలు, రిస్క్ తగ్గుతాయి. లవంగాల్లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి సమ్మర్‌లో అధిక వేడి వాతావరణం కారణంగా వచ్చే వృద్ధాప్యాన్ని తగ్గిస్తూ, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

పోషకాలు
లవంగాల్లో విటమిన్లు, ఖనిజాలు, అనేక ముఖ్యమైన పోషకాలు అందుబాటులో ఉంటాయి. వీటిలో విటమిన్లు ఏ, సీ, డీ, రైబోఫ్లావిన్, థయామిన్ వంటి బీ-కాంప్లెక్స్ విటమిన్లు, హెల్త్‌కు మంచి చేసే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. లవంగాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

జీర్ణ సమస్య దూరం
లవంగాల్లోని సమ్మేళనాలు జీర్ణప్రక్రియను బాగా పని చేసేలా చేస్తాయి. ఇవి జీర్ణ ఎంజైమ్స్ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు పేగు లోపలి కదలికలను బాగు చేస్తాయి. లవంగాలు కార్మినేటివ్ ప్రభావంతో గ్యాస్, ఉబ్బరం నుంచి రిలీఫ్ కలిగిస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
లవంగాల్లో చాలా రకాల యాంటీఆక్సిడెంట్లు అందుబాటులో ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌తో కూడా పోరాడతాయి. నొప్పి నుంచి ఉపశమనం కల్పించే లక్షణాలు లంగాల్లో ఉంటాయి.

బ్లడ్ షుగర్ నియంత్రణ
రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం లవంగాలకు ఉంది. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చగలవని అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే, ఇవి మధుమేహానికి చికిత్స చేసే మెడిసిన్ మాత్రం కావు.

నోరు శుభ్రం
లవంగాలు నమలడం వల్ల నోటి ఆరోగ్యం బాగుపడుతుంది. వీటిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు సూక్ష్మజీవులను నిర్మూలించి, నోటిని క్లీన్ చేస్తాయి. తద్వారా కావిటీస్, గమ్ ప్రాబ్లమ్స్ వంటి దంత సమస్యలు రాకుండా ఉంటాయి. లవంగం నూనెను డెంటల్ ప్రాబ్లమ్స్‌కు చికిత్సగా, ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో వాడతారు.

అందరికీ పడవు!
లవంగాలను పరిమితంగా తీసుకోవాలి. ఇలా చేస్తే ఏ సమస్యలూ రావు. అయితే, ఇవి అందరికీ పడకపోవచ్చు. ఎక్కువ మొత్తంలో లవంగాలు తింటే ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే చాన్స్ ఉంటుంది. లవంగం నూనె వినియోగం పెరిగితే వికారం, వాంతులు, విరేచనాలు, ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది కొన్నిసార్లు విషపూరితం అయ్యే ప్రమాదమూ ఉంటుంది.

ఇవీ చదవండి: Child Care: చిన్నారుల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపాలి?
Sabja Ginjalu: పరగడుపున సబ్జా గింజలతో ఇలా చేస్తే మీ ఆరోగ్యం పదిలం!
YS Jagan in Mangalagiri: పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం.. మంగళగిరిలో సీఎం జగన్
Sleep: మనిషికి నిద్ర ఎలా ఉపయోగపడుతుంది? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
Wax gourd: బూడిద గుమ్మడికాయతో మీ ఆరోగ్యం పదిలం.. ప్రయోజనాలు ఇవీ..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు