HomeAndhra PradeshModi 3.0 Cabinet: ఏపీ నుంచి కేంద్ర మంత్రి పదవులు ముగ్గురికి...

Modi 3.0 Cabinet: ఏపీ నుంచి కేంద్ర మంత్రి పదవులు ముగ్గురికి…

Modi 3.0 Cabinet: కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ ముచ్చటగా మూడోసారి కొలువుదీరనుంది. హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన నేపథ్యంలో మోదీ ప్రధానిగా ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పదవుల విషయంలో చర్చోప చర్చలు కొనసాగాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించి ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి.

బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీనివాస వర్మ విక్టరీ అందుకున్నారు. ఇక మరో ఇద్దరి విషయానికి వస్తే టీడీపీ తరఫున శ్రీకాకుళం నుంచి ఎంపీగా నెగ్గిన రామ్మోహన్‌ నాయుడు, గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు ఖాయం అయ్యాయి.

Read also: Modi 3.0 Cabinet: కేంద్ర మంత్రి పదవులు తెలంగాణలో ఎవరెవరికంటే..
Ramoji Rao: రామోజీరావుకు కన్నీటి వీడ్కోలు.. అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి
AP CS: ఏపీ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతల స్వీకారం
Hyderabad: కక్కుర్తి పడ్డారో ఖతమైపోతరు.. హైదరాబాద్‌లో డేటింగ్ స్కామ్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు