HomeTelanganaModi 3.0 Cabinet: కేంద్ర మంత్రి పదవులు తెలంగాణలో ఎవరెవరికంటే..

Modi 3.0 Cabinet: కేంద్ర మంత్రి పదవులు తెలంగాణలో ఎవరెవరికంటే..

Modi 3.0 Cabinet: మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవాళ సాయంత్రం కొలువుదీరనుంది. మంత్రి పదవుల విషయంలో అనేక చర్చలు జరిపిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటు దక్కింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్‌ రెడ్డిలకు అవకాశం దక్కనుంది.

ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీతో పాటు సుమారు 30 మంది సెంట్రల్‌ మినిస్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి అవకాశం లభిస్తోంది. ఈ మేరకు పీఎంవో నుంచి వారిద్దరికీ ఫోన్‌ కాల్స్‌ ద్వారా సమాచారం వచ్చింది. దీంతో వారిద్దరూ ఢిల్లీకి పయనమయ్యారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌ ఘన విజయం సాధించారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా పలువురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఏపీలో కూటమి ఘన విజయం నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని శ్రీకాకులం పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీగా ఫస్ట్‌ అటెప్ట్‌లోనే గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు, భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ మేరకు వారిద్దరికీ ఫోన్ ద్వారా పీఎంవో వర్గాలు సమాచారం అందించాయి.

ఇవీ చదవండి: Ramoji Rao: రామోజీరావుకు కన్నీటి వీడ్కోలు.. అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి
AP CS: ఏపీ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతల స్వీకారం
Hyderabad: కక్కుర్తి పడ్డారో ఖతమైపోతరు.. హైదరాబాద్‌లో డేటింగ్ స్కామ్!
Chandrababu: దూరదృష్టి కలిగిన ప్రధాని మోదీ: ఎన్డీఏ భేటీలో చంద్రబాబు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు