Ramoji Rao: మీడియా మొఘల్, వ్యాపార దిగ్గజం రామోజీరావు నిన్న కన్నుమూశారు. అశ్రు నయనాల మధ్య ఇవాళ అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో రామోజీరావు బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, క్యాన్సర్‌తోనూ కొన్నాళ్లుగా ఆయన బాధపడుతున్నారు. ఈనెల 5వ తేదీన అస్వస్థతకు గురైన రామోజీరావును కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. నిన్న తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలను నిర్వహించింది. నేడు ఉదయం ఫిల్మ్ సిటీ నుంచి రామోజీరావు పార్థివ దేహాన్ని ఆయన స్మారక నిర్మాణం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అశ్రు నయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. టీడీపీ అధినేత, త్వరలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు స్వయంగా రామోజీరావు పాడె మోశారు. 40 ఏళ్లుగా వారిద్దరి మధ్య అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు రాజకీయ గురువుగా రామోజీరావును అభివర్ణిస్తారు.
Read also: AP CS: ఏపీ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతల స్వీకారం
Hyderabad: కక్కుర్తి పడ్డారో ఖతమైపోతరు.. హైదరాబాద్‌లో డేటింగ్ స్కామ్!
Chandrababu: దూరదృష్టి కలిగిన ప్రధాని మోదీ: ఎన్డీఏ భేటీలో చంద్రబాబు
Modi Pawan Kalyan: జనసేనానిపై మోదీ పొగడ్తలు.. పవన్ కాదు.. తుఫాన్
