HomeBusinessStock Market: కొనసాగిన స్టాక్ మార్కెట్‌ లాభాల జోరు.. సెన్సెక్స్ 1,600 పాయింట్లు లాభం

Stock Market: కొనసాగిన స్టాక్ మార్కెట్‌ లాభాల జోరు.. సెన్సెక్స్ 1,600 పాయింట్లు లాభం

Stock Market: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి కొలువుదీరనున్న నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో కొనసాగి ముగిశాయి. ఎలక్షన్‌ రిజల్ట్‌ నాటి నుంచి సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టనుండటం, ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ మరోసారి సేమ్‌ సిట్యుయేషన్‌ ఉంటుందని తేల్చడంతో స్టాక్‌ మార్కెట్లు ఇవాళ దూసుకెళ్లాయి.

ప్రధానంగా రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌ లాంటి షేర్లు రాణించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ సరికొత్త గరిష్ఠాలను టచ్‌ చేసింది. నిఫ్టీ 23,000 ఎగువకు చేరుకుంది. మరోవైపు సెన్సెక్స్‌ 75,031.79 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆద్యంతం అదే ఒరవడిని కంటిన్యూ చేసింది. ఇంట్రాడేలో 76,795.31 పాయింట్ల వద్ద లైఫ్‌టైమ్‌ హై నమోదు చేసింది. చివరికి 1618.85 పాయింట్ల లాభంతో 76,693.36 వద్ద ముగిసింది. నిఫ్టీ 468.75 పాయింట్ల లాభంతో 23,290.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ
83.38 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌లోని 30 సంస్థలు లాభాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, విప్రో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌ షేర్లు ముఖ్యంగా లాభాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 79.92 డాలర్లు, బంగారం ఔన్సు 2,355 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

ఇవీ చదవండి: Virat Kohli Assets: కింగ్‌ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఇదే.. స్టాక్‌ గ్రో వెల్లడించిన ఆసక్తికర విశేషాలు
School Bags AP: సకాలంలో మండల కేంద్రాలకు స్కూలు బ్యాగులు
Free Hit: క్రికెట్‌లో ఫ్రీ హిట్ అంటే ఏమిటి?
Onion: ఉల్లిపాయ తొక్కతో ఊహించని ప్రయోజనాలు..!
Varicose veins: వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? ఎందుకు వస్తాయి? చికిత్స ఎలా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు