HomeAndhra PradeshMega Family: మెగా ఫ్యామిలీ ఇంట భావోద్వేగం.. అన్నయ్య కాళ్లు మొక్కి కౌగిలిలో ఒదిగిపోయిన పవన్

Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట భావోద్వేగం.. అన్నయ్య కాళ్లు మొక్కి కౌగిలిలో ఒదిగిపోయిన పవన్

Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట భావోద్వేగాల సందడి ఏర్పడింది. అన్నయ్య చిరంజీవి వద్దకు వెళ్లిన తమ్ముడు పవన్ కల్యాణ్‌.. నేరుగా పాదాభివందనం చేశారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు ఆనంద భాష్పాలతో మునిగిపోయాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తాను గెలవడంతోపాటు పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయ బావుటా ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో జనసేన వంద శాతం స్ట్రైక్‌ రేట్‌తో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.

చారిత్రాత్మకమైన ఈ ఘట్టాన్ని పవన్‌ కల్యాణ్‌ తన కుటుంబంతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా అన్నయ్య ఇంటికి వెళ్లిన పవన్‌ కల్యాణ్.. నేరుగా చిరంజీవి కాళ్లు మొక్కారు. అనంతరం ఆనందంతో అన్నయ్యను హత్తుకున్నారు. మెగాస్టార్‌ కూడా తమ్ముడి ఎదుగుదల చూసి పొంగిపోయారు. ఆనంద భాష్పాలు కార్చారు. యుద్ధంలో గెలిచి తన వాళ్ల వద్దకు వెళ్లిన పవన్‌.. అమ్మ, అన్నయ్యలు, బంధువుల ప్రేమానురాగాల నడుమ తడిసి ముద్దయ్యారు. ఈ సన్నివేశాలు, చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగా అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.

ఇవీ చదవండి: Nagababu: పవన్ కల్యాణ్ పై నమ్మకంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు: నాగబాబు
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభంజనం.. ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీతో చంద్రబాబు హవా
Chandrababu Naidu: చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి వేగంగా ఏర్పాట్లు
Accident: హిమాలయాల్లో ప్రమాదం.. ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురి దుర్మరణం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు