HomeAndhra PradeshModi Pawan Kalyan: జనసేనానిపై మోదీ పొగడ్తలు.. పవన్‌ కాదు.. తుఫాన్‌

Modi Pawan Kalyan: జనసేనానిపై మోదీ పొగడ్తలు.. పవన్‌ కాదు.. తుఫాన్‌

Modi Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ప్రధాని మోదీ పొగడ్తలు కురిపించారు. ఇవాళ ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ఎన్డీఏ ఎంపీల భేటీ జరిగింది. ఈ సందర్భంగా కూటమి లోక్‌సభాపక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును బీజేపీ నేతలు అమిత్‌ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదన చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ మాట్లాడారు.

పవన్‌ను ఉద్దేశించి.. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్‌ కాదు.. తుఫాన్‌ అంటూ మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను మోదీ కొనియాడారు.

భాగస్వామ్య పార్టీలు మోదీ ఎన్నికకు మద్దతు పలుకుతూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటన చేశాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సాధించామని తెలిపారు.

ఇవీ చదవండి: Stock Market: కొనసాగిన స్టాక్ మార్కెట్‌ లాభాల జోరు.. సెన్సెక్స్ 1,600 పాయింట్లు లాభం
Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట భావోద్వేగం.. అన్నయ్య కాళ్లు మొక్కి కౌగిలిలో ఒదిగిపోయిన పవన్
Andhra Pradesh: మేం వెళ్లిపోతాం ప్లీజ్.. ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు క్యూ..
Chandrababu Naidu: చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి వేగంగా ఏర్పాట్లు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు