Chandrababu: నరేంద్ర మోదీపై (PM Modi) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని గుర్తు చేశారు. ఎన్డీయేను అధికారంలోకి తీసుకొచ్చారని ప్రశంసించారు. అన్నారు. కొత్త ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సరైన సమయంలో సరైన నాయకత్వం మన దేశానికి అంది వచ్చిందంటూ కామెంట్ చేశారు చంద్రబాబు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం నుంచి ఆఖరి దాకా నరేంద్ర మోదీ చాలా కష్టపడ్డారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ 3 బహిరంగసభలు, ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 90 శాతం స్థానాలు గెలుచుకున్నామన్నారు. విజనరీ నాయకుడి నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందుకుక దూసుకెళ్తోందన్నారు చంద్రబాబు.
ప్రధాని మోదీ దూరదృష్టి కలిగిన వారని, ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని కొనియాడారు చంద్రబాబు. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఈ సందర్భంగా చంద్రబాబు కామెంట్ చేశారు. సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధాని కావడంతో దేశం పురోభివృద్ధి సాధించిందన్నారు. మేకిన్ ఇండియాతో భారత్‌ను ఆయన వృద్ధిపథంలో నడిచేలా చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా మోదీ చర్యలు తీసుకున్నారన్నారు. ఆయన నాయకత్వంలో దేశం పేదరిక రహితంగా మారుతోందన్నారు. 2047 నాటికి మోదీ నాయకత్వాన భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Read also: Chandrababu Naidu: చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి వేగంగా ఏర్పాట్లు
Stock Market: కొనసాగిన స్టాక్ మార్కెట్ లాభాల జోరు.. సెన్సెక్స్ 1,600 పాయింట్లు లాభం
Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట భావోద్వేగం.. అన్నయ్య కాళ్లు మొక్కి కౌగిలిలో ఒదిగిపోయిన పవన్
Andhra Pradesh: మేం వెళ్లిపోతాం ప్లీజ్.. ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు క్యూ..
