HomeCinemaAkira nandhan: పవన్‌తో కలిసి అకీరా నందన్ మోదీని కలవడంపై రేణు ఎమోషనల్‌

Akira nandhan: పవన్‌తో కలిసి అకీరా నందన్ మోదీని కలవడంపై రేణు ఎమోషనల్‌

Akira nandhan: తన తనయుడు అకీరా నందన్.. మాజీ భర్త పవన్‌ కల్యాణ్‌తో కలిసి ప్రధాని మోదీని కలవడం పట్టలేనంత సంతోషంగా ఉందని రేణూ దేశాయ్‌ చెప్పారు. ఏపీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ గ్రాండ్ విక్టరీ సాధించిన నాటి నుంచి అకీరా తన తండ్రితోనే ఉంటున్నాడు. అతడిని రాజకీయ ప్రముఖులకు పవన్‌ ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి కాబోయే ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్‌ (Renu Desai) భావోద్వేగమయ్యారు.

తనకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం అని రేణు పేర్కొన్నారు. మోదీ (Narendra Modi) పక్కన తన కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్‌గా ఉందన్నారు. దాన్ని మాటల్లో వర్ణించలేనన్నారు. మోదీని కలిశాక అకీరా (Akira Nandan) తనకు ఫోన్‌ చేసి తన అనుభూతిని పంచుకున్నాడని, ఆయన చాలా గొప్ప వ్యక్తి అన్నారు. తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్‌ ఉందని అకీరా చెప్పాడని రేణు పేర్కొన్నారు.

ఎన్డీఏ కూటమి భేటీలో పవన్‌ (Pawan Kalyan) తన కుటుంబంతో సహా పాల్గొన్నారు. తన కుమారుడు అకీరాను కూడా ఢిల్లీకి తీసుకెళ్లారు పవన్. కూటమి నేతల భేటీ ముగిసిన తర్వాత మోదీకి తన కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ (PM Modi) మాట్లాడుతున్న వీడియో, ఫొటో నెట్టింట చక్కర్లు కొట్టాయి.

ఇవీ చదవండి: Modi Pawan Kalyan: జనసేనానిపై మోదీ పొగడ్తలు.. పవన్‌ కాదు.. తుఫాన్‌
Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట భావోద్వేగం.. అన్నయ్య కాళ్లు మొక్కి కౌగిలిలో ఒదిగిపోయిన పవన్
Nagababu: పవన్ కల్యాణ్ పై నమ్మకంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు: నాగబాబు
Perni Nani: కూటమి కకావికలం.. మోదీ, పవన్‌ ఫొటోలు ఏవీ?: పేర్ని నాని విమర్శలు
CM Jagan Kakinada Sabha: ఇళ్లు కట్టించే కార్యక్రమాలను ఆపించాలనే దిక్కుమాలిన ఆలోచన.. పవన్‌పై జగన్ ఫైర్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు