HomeAndhra PradeshAndhra Pradesh: మేం వెళ్లిపోతాం ప్లీజ్.. ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు క్యూ..

Andhra Pradesh: మేం వెళ్లిపోతాం ప్లీజ్.. ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు క్యూ..

Andhra Pradesh: ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా డిప్యుటేషన్ వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. డిప్యుటేషన్ వచ్చిన పలువురు అధికారులు రిలీవ్ చేయాలని దరఖాస్తు చేస్తున్నారు. మాతృ సంస్థకు వెళ్తానని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ దరఖాస్తు చేశారు. ఏపీ నుంచి రిలీవ్ చేయాలని గనులశాఖ ఎండీ వెంకటరెడ్డి దరఖాస్తు చేశారు.

తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని సమాచారశాఖ కమిషనర్ విజయజమార్ రెడ్డి కోరారు. మాతృ శాఖకు పంపాలని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కోరారు. ఏపీ నుంచి రిలీవ్ చేయాలని ఏపీఎఫ్ ఎస్ ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి కోరారు. ఏపీ నుంచి రిలీవ్ చేయాలని పరిశ్రమలశాఖ కమిషనర్ రాజేశ్వర్ రెడ్డి కూడా విన్నవించుకున్నారు. డిప్యుటేషన్ పై వచ్చిన వారిపై గతంలో పెద్దఎత్తున టీడీపీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

తెలంగాణకు వెళ్తానంటూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ కోరుతున్నారు. తెలంగాణ వెళ్లేందుకు మరి కొందరు కీలక అధికారులు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఎవరికీ సెలవులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సెలవులవుపై వెళ్తానంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరుతున్నారు. ధర్మారెడ్డి సెలవు దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కి తీసుకున్నారు.

ఇవీ చదవండి: Chandrababu Naidu: చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి వేగంగా ఏర్పాట్లు
Nagababu: పవన్ కల్యాణ్ పై నమ్మకంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు: నాగబాబు
Accident: హిమాలయాల్లో ప్రమాదం.. ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురి దుర్మరణం
Cancer Screening: ఏపీలో క్యాన్సర్ స్క్రీనింగ్ కు కార్యాచరణ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు