Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం కల్కి. (Kalki 2898 AD). దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల జూన్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. తాజాగా చిత్రబృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ప్రభాస్, నాగ్ అశ్విన్ జాతీయ మీడియాతో మాట్లాడారు.
కల్కి గ్లోబల్ రేంజ్‌లో ఉండనుందని హీరో ప్రభాస్ తెలిపారు. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించామన్నారు. అందువల్లే అంత ఎక్కువ బడ్జెట్ అయ్యిందంటూ తెలిపారు. దేశంలోని గొప్ప నటీనటులను ఈ సినిమా కోసం తీసుకున్నామన్నారు.
తనను అందరూ పాన్ ఇండియా స్టార్ అంటూ పిలుస్తున్నారని, అది తనపై ఎలాంటి ప్రభావం చూపబోదంటూ క్లారిటీ ఇచ్చారు రెబల్ స్టార్. అయితే, తనను అలా పిలవడాన్ని అభిమానులు లైక్ చేస్తారని తెలిపాడు. వాళ్లకు ఆ పిలుపు సంతోషాన్నిస్తుందని ప్రభాస్ కామెంట్ చేశాడు.
ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ చిత్రం గురించి చెబుతూ.. కల్కి మూవీ చూశాక ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లొచ్చిన ఫీలింగ్ కలుగుతుందన్నారు. అవతార్ సినిమా చూశాక అలాంటి అనుభూతే తనకు కలిగిందని గుర్తు చేసుకున్నారు. ఒక కొత్త లోకాన్ని చూసినట్లు భావన కలుగుతుందన్నారు.
ఇప్పుడు కల్కి (Kalki Movie) చూశాక సినిమా థియేటర్లలో ఉన్న ప్రేక్షకులకు అలానే అనిపిస్తుందన్నారు. ఇందులోని పాత్రల పేర్లు కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం చూస్ చేసుకున్నట్లు దర్శకుడు తెలిపారు. వీటిలో ఎలాంటి మార్పులు లేకుండా మన దగ్గర కూడా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‌తో సహా మరికొన్ని విదేశీ భాషల్లో కల్కి చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.
ఇవీ చదవండి: Kalki 2898AD: ప్రభాస్ కల్కి వాయిదా? మే 13న ఎన్నికల నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
Pithapuram: పిఠాపురం.. ఎమ్మెల్యేగారి తాలూకానా? డిప్యూటీ సీఎం గారి తాలూకానా?
Kalki 2898 AD: కల్కి 2898AD ప్రత్యేకం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!
