HomeTelanganaTelangana: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్

Telangana: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్

Telangana: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తాజాగా మరో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ రాష్ట్ర అధికారికు చిహ్నం కొత్తది తయారు చేయించే పనిలో ఉన్నారు సీఎం రేవంత్. ఈ మేరకు అన్ని హంగులతో కొత్త లోగోను క్రియేట్ కూడా చేశారు. అయితే, దీనిపై విమర్శలు జోరందుకోవడంతో రేవంత్ ప్రభుత్వం కొత్త చిహ్నం రిలీజ్ ను వాయిదా వేయక తప్పలేదు.

తెలంగాణ అధికారిక చిహ్నం రిలీజ్ ప్రక్రియ వాయిదా పడింది. దీనిపై సుమారు 200 కు పైగా సూచనలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం దీనిపై నిపుణులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. మొదట తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాన్ని కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు పాటను మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పుడు అమల్లో ఉన్న అధికారిక గుర్తులో రాచరికపు పోకడలున్నాయని, వాటిని తొలగించాలని రేవంత్ సర్కార్ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్‌ చాలా సార్లు చర్చలు జరిపారు. కొన్ని మోడల్స్ రెడీ చేశారు. ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగాలు లాంటి అంశాలను జోడించాలని నిర్ణయించారు. ఇలా కొత్త చిహ్నాన్ని తయారు చేయించాలని నిర్ణయించారు. వీటిపై మంత్రివర్గం, పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు చూపి వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుని తుది రూపు ఇచ్చేలా ప్రభుత్వం భావిస్తోంది.

ఇక రాష్ట్ర ఉద్యమ సమయాన అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు బాహుబలి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. పూర్తి పాటను 13.30 నిమిషాల సమయం ఉండేలా తయారు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తెలంగాణకు వచ్చిన సమయాల్లో పాడేందుకు సులువుగా ఉండేలా మరో 2.30 నిమిషాల నిడివితో ఇంకో పాటను తయారు చేస్తున్నారు.

ఇవీ చదవండి: Kalki 2898 AD: గ్లోబల్ రేంజ్‌లో కల్కి.. మరో ప్రపంచంలోకి వెళ్లడం పక్కా!
Haj Yatra 2024: ఈ ఏడాది హజ్ యాత్ర వియవంతం
Pithapuram: పిఠాపురం.. ఎమ్మెల్యేగారి తాలూకానా? డిప్యూటీ సీఎం గారి తాలూకానా?
Pensions: పెన్షన్ల సొమ్ము విడుదల.. ఈ నెల కూడా 73.11 శాతం డీబీటీ పద్ధతిలోనే జమ!
CS Jawahar Reddy: దుష్ప్రచారంపై లీగల్‌ నోటీసులు.. న్యాయ నిపుణులతో జవహర్‌రెడ్డి సంప్రదింపులు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు