HomeAndhra PradeshHaj Yatra 2024: ఈ ఏడాది హజ్ యాత్ర వియవంతం

Haj Yatra 2024: ఈ ఏడాది హజ్ యాత్ర వియవంతం

Haj Yatra 2024: హజ్ యాత్ర ఏపీ నుంచి విజయవంతం అయ్యిందని ఏపీ హజ్ కమిటీ తెలిపింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. 2024 పవిత్ర హాజ్ యాత్ర సక్సెస్ మీట్ బుధవారం గన్నవరం ఈద్గా జామా మసీదు హజ్ క్యాంపు వద్ద నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హజ్ ఆపరేషన్స్ చైర్మన్ హర్షవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర హజ్ కమిటీ, వక్ఫ్ బోర్డ్, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో 2024 హజ్ యాత్ర విజయవంతం అయిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ వివిధ శాఖల అధికారులు సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేసింది.

వక్ఫ్ బోర్డ్ సీఈవో మరియు హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, హజ్ కమిటీ సభ్యులు సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీం బాషా, దూదేకుల కార్పొరేషన్ ఎండీ గౌస్ పీర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం ఎల్ కె రెడ్డి, ఎయిర్పోర్ట్ భద్రతాధికారులు డీఎస్పీలు వెంకటరత్నం, గుప్తా, జయ సూర్య, సెంట్రల్ హాజ్ కమిటీ సభ్యులు బిలాల్ అన్సారి, అక్బర్ పాల్గొన్నారు.

ఇవీ చదవండి: Haj Yatra: ఏపీ నుంచి హజ్ యాత్రకు బయల్దేరిన రెండో బృందం
Haj Yatra: విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్‌ యాత్రకు 728 మంది
Haj Yatra: హజ్‌ యాత్రికులకు గుడ్‌ న్యూస్.. నేరుగా ఏపీ నుంచే యాత్ర..!
Rahul Gandhi: మా మేనిఫెస్టో ప్రజల హృదయాల నుంచి పుట్టింది: తుక్కుగూడ సభలో రాహుల్‌ గాంధీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు