HomeTelanganaPhone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన వాంగ్మూలం

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన వాంగ్మూలం

Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకూ సంచలనం రేపుతోంది. తాజాగా భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మీడియా యాజమాన్యాలు, జ్యుడీషియరీ ఫోన్ల ను ట్యాప్ వేసినట్టు భుజంగరావు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఒక ఛానల్ కి చెందిన శ్రవణ్ రావుతో ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రణీత్ రావుకు మధ్య సంబంధాలు ఉన్నాయని తెలిపినట్లు తెలుస్తోంది.

ఒక మాజీ అండదండలతో శ్రవణ్ రావు చెలరేగిపోయినట్లు తెలుస్తోంది. మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్ల ను శ్రవణ్ రావు ట్యాప్ చేయించాడని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. మీడియా సంస్థలపై నిఘా కోసం ఫోన్ ట్యాపింగ్ కు ప్రైవేట్ సైన్యాన్ని గత కేసీఆర్ సర్కారు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మాజీ మంత్రి డైరెక్షన్ లో ఒక ఛానల్ యజమాని శ్రవణ్ రావు పని చేశారని తెలుస్తోంది.

మాజీ మంత్రితో ఒక ఛానల్ యజమాని శ్రవణ్ రావు కుమ్మక్కు అయ్యారని తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడగానే దేశం వదిలి ఛానల్ యజమాని శ్రవణ్ రావు పారిపోయినట్లు తేలింది. ఇప్పటికే ఆ ఛానల్ యజమాని పై లుక్ అవుట్ నోటీసులు అయ్యాయి. ఛానల్ యజమానికి, ప్రణీత్ రావుకు మాజీ మంత్రికి మధ్య ఉన్న సంబంధాలపై మరింత సిట్ మరింత ఆరా తీస్తోంది.

Read Also: Telangana: ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల లేఖ విడుదల
Telangana: తెలంగాణలో రెండు వారాలపాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేత
Telangana Polling Percentage: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్
Telangana Budget: కొత్త ప్రభుత్వంలో రూ.2,75,897 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులు ఎలా ఉన్నాయంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు