HomeCinemaKalki 2898 AD: కల్కి 2898AD ప్రత్యేకం.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే!

Kalki 2898 AD: కల్కి 2898AD ప్రత్యేకం.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే!

Kalki 2898 AD: రెబల్‌ స్టార్ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా వస్తోంది. ఇందులో డార్లింగ్ ప్రభాస్‌.. భైరవగా కనిపిస్తున్నారు. ఈ మూవీలో ‘బుజ్జి’ అనే వాహనం కీలకంగా నిలవనుందట.

ఈ అధునాతన వెహికల్‌ను ఫ్యాన్స్‌కు ఇంట్రడ్యూస్‌ చేసేందుకు చిత్ర బృందం ఇటీవల ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించింది. దీంతో, బుజ్జితో భైరవ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకునేందుకు సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘కల్కి’ టీమ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ తో ముందుకొచ్చింది.

బుజ్జి అండ్‌ భైరవ (Bujji And Bhairava) పేరుతో రూపొందించిన స్పెషల్‌ వీడియోను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video)లో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటించడంతో చిన్నారులకు వినోదం అందనుంది. ఈ వీడియో గ్లింప్స్‌ చూస్తే చిల్‌డ్రన్స్‌ బాగా ఖుషీ అవుతారని అర్థమవుతోంది.

భారీ ఇతిహాసాలతో ఉన్న ఈ అతి భారీ బడ్జెట్‌ మూవీలో బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), లోక నాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), అందాల తార దీపికా పదుకొణె (Deepika Padukone), హాట్‌ భామ దిశా పటానీ (Disha Patani) తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల అవుతోంది.

ఇవీ చదవండి: Kalki 2898AD: ప్రభాస్‌ కల్కి వాయిదా? మే 13న ఎన్నికల నేపథ్యంలో కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా?
Sleep: మనిషికి నిద్ర ఎలా ఉపయోగపడుతుంది? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
Smoking: పొగతాగడం వల్ల ఎన్ని దుష్పరిణామాలో తెలుసా? పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం!
Child Care: చిన్నారుల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపాలి?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు