HomeAndhra PradeshDBT Amount: మాట నిలబెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ

DBT Amount: మాట నిలబెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ

DBT Amount: ఎన్నికల నేపథ్యంలో లబ్ధిదారులకు డీబీటీ నగదు బదిలీ ఆగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రక్రియ పునరుద్ధరించింది జగన్‌ సర్కార్. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ఉన్న తరుణంలో డీబీటీని ఈసీ ఆపేసింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమ చేస్తోంది జగన్ ప్రభుత్వం. 4 రోజుల్లో రూ. 5,868 కోట్ల నిధులు జమ చేసింది.

వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ. 1843 కోట్లు జమ చేశారు. ఇన్ ఫుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాల్లో రూ. 1,236 కోట్లు జమ చేశారు. వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1,552 కోట్లు జమ చేశారు. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ. 629 కోట్లు జమ చేశారు. జగనన్న విద్యాదీవెన ఫీజు రీయింబర్స్ మెంట్ కింద 605 కోట్లు జమ చేశారు. ఎన్నికల కమిషన్ అడ్డుకోవడంతో ఇన్నాళ్లు నిధులకు గ్రహణం పట్టింది. సీఎం జగన్ హామీ ఇచ్చినట్టుగానే ఎన్నికలు అవ్వగానే చెల్లింపులు ప్రారంభమయ్యాయి.

చేయూత మినహా అన్ని డీబీటీ స్కీంల లబ్ధిదారుల ఖాతాలకు చెల్లింపులు పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. చేయూత పథకం కింద ఇంకా రూ. 3,512 కోట్ల మేర పెండింగ్ ఉన్నాయి. ఈనెల 14 నుంచి ఇప్పటి వరకు రూ. 7,546.34 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి.

ఇవీ చదవండి: YS Jagan: నేడు విదేశీ పర్యటనకు సీఎం జగన్
YS Jagan with I-Pac: 151 దాటేస్తాం.. వైయస్ జగన్‌ కాన్ఫిడెన్స్ ఇదీ
CM Jagan: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
YS Jagan in Pithapuram: పిఠాపురంలో సీఎం జగన్ మాస్‌ స్పీచ్.. ఇక్కడ చదవండి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు