HomeNationalBJP - AAP: బీజేపీ కార్యాలయం వద్ద ఆప్ నిరసన.. ఢిల్లీలో ఉద్రిక్తత

BJP – AAP: బీజేపీ కార్యాలయం వద్ద ఆప్ నిరసన.. ఢిల్లీలో ఉద్రిక్తత

BJP – AAP: ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆప్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆప్ మంత్రులు అతిశీ, సౌరభ్ భరద్వాజ్ సహా ఎంపీ రాఘవ్ చడ్డా జైలుకు వెళ్లారంటూ బీజేపీ నేతలు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ఆప్ నేతల అరెస్టు పై బీజేపీ కి కేజ్రీవాల్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ఆఫీస్ కు ఎంపీలు, ఎమ్మెల్యేలతో వస్తానని కేజ్రీవాల్ ప్రకటన చేశారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటనతో పోలీసుల అలర్ట్ అయ్యారు. బీజేపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు చేశారు. నిన్న నిందితుడు బిభవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. బిభవ్ ను తీస్ హాజారీ కోర్టులో హాజరుపర్చారు. బిభవ్ కు ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది.

ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఆప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యాలయానికి ఆప్ నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్ అరెస్ట్ పై నిరసన తెలిపారు. నేతలు, కార్యకర్తలతో ఆ ప్రాంతం కోలాహలంగా మారిపోయింది. బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు ఆప్ నేతలు ప్రయత్నించారు. కేజ్రీవాల్ సహా అప్ నేతలను పోలీసులు అడ్డగించారు. డీడీయూ మార్గ్ లో 144 సెక్షన్ విధించారు.

బీజేపీ కార్యాలయం వద్ద ఆప్ నిరసన
ఆప్ నేతలపై వేధింపులను వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యాలయం వద్ద ఆప్‌ నేతలు నిరసన తెలిపారు. ఆప్ నిరసనకారులను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. డీడీయూ మార్గ్ లో 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో ఐటీవో మెట్రోస్టేషన్ తాత్కాలికంగా మూసివేశారు.

5 రోజుల పోలీస్ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ 5 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో బిభవ్‌ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బిభవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. బిభవ్ ఇచ్చిన సెల్ ఫోన్ లో డేటా డిలీట్ అయినట్లు గుర్తించారు. మొబైల్ డేటా రికవరీకి పోలీసులు ప్రయత్నించారు. మహిళా ఎంపీపై దాడి కేసులో బిభవ్ ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నారు.

ఇవీ చదవండి: YS Jagan at INDIA Today Education Summit: కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైయస్‌ జగన్‌.. ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో కీలక అంశాల ప్రస్తావన
DBT Amount: మాట నిలబెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు