Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి. దక్షిణ అండమాన్, నికోబార్, మాల్దీవులు కొమరిన్ వరకు రుతుపవనాలు విస్తరించి ఉన్నాయి. మరింత విస్తరణకు బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈనెల 31 నాటికి కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలో రాయలసీమలోకి రుతుపవనాలు వచ్చే చాన్స్ ఉంది. ఈనెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈనెల 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖతెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి ఏర్పడనుంది.
కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడనుందని, దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నేడు అండమాన్ కు నైరుతి రుతుపవనాలు చేరుకోనున్నాయి.
ఇవీ చదవండి: Rains in AP: ద్రోణి ప్రభావంతో రెండు రోజులు ఏపీలో మోస్తరు వర్షాలు
Mannara Chopra: వర్షంలో డ్యాన్స్.. మన్నారా చోప్రాపై దారుణమైన ట్రోలింగ్
Nigeria Jail: నైజీరియాలో భారీ వర్షాలకు కూలిన జైలు.. 118 మంది ఖైదీలు పరార్
Weather Report Now: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వర్ష సూచన
