Helicopter: రాజకీయ నాయకులు ఎన్నికల సమావేశాలు, సభలకు హెలికాప్టర్లను తీసుకుని చక్కర్లు కొట్టడం మనం చూస్తుంటాం. బిజినెస్ మెన్, ఇతర డబ్బున్న వాళ్లు అయితే సొంతంగా చాపర్స్, హెలికాప్టర్స్ లో తిరుగుతుంటారు. అయితే ఎక్కువ మంది వీటిని అద్దెకు తీసుకొని వినియోగిస్తుంటారు. కొన్ని ప్రైవేటు కంపెనీలు కూడా ఈ హెలికాప్టర్లను అద్దెకు ఇస్తుంటాయి. సాధారణ వ్యక్తులు హెలికాప్టర్ ను అద్దెకు తీసుకోవాలంటే ఏం చేయాలన్నది చాలా మందికి తెలియదు. ఎవరిని సంప్రదించాలి? ఎంత ఖర్చవుతుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవడం ఇండియాలో కొత్తదేమీ కాదు. నిజానికి, ఇది అనేక అంశాల్లో కీలక పాత్ర వహిస్తుంది. చాలా ఏళ్లుగా భక్తులు దూరం ప్రయాణించి, ఆయా పవిత్ర స్థలాల్లో అంజలి ఘటించేందుకు, అమర్‌నాథ్, వైష్ణోదేవి వంటి మతపరమైన ధామ్‌ల ప్రారంభ స్థానాల నుంచి పలు ఏజెన్సీలు చాపర్లను ప్రొవైడ్ చేస్తున్నాయి. తక్కువ టైమ్‌లో ఎక్కువ దూరాలను కవర్ చేయాలి అనుకునే వారికి హెలికాప్టర్ అద్దెకు తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. హెలిప్యాడ్ కోసం కాస్త ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేయడం ఈజీ అవుతుంది.
ఎలా అద్దెకు తీసుకోవాలంటే..
హెలికాప్టర్‌ను బుక్ చేసుకోవడం అత్యంత సులువు. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని ఏజెన్సీలు వర్క్ చేస్తుంటాయి. వారి వెబ్‌సైట్‌లలోకి వెళ్లి, మీ గమ్యస్థానంలో ఏవైనా ఛాపర్‌లు అందుబాటులో ఉన్నాయా అన్నది చూసి బుకింగ్ చేయాలి. వ్యక్తుల సంఖ్య, వ్యక్తిగత లేదా సమూహ బుకింగ్‌లు సరి చూసుకుని బుకింగ్ ఫార్మాలిటీ ప్రక్రియ పూర్తి చేసి, అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్లు సమర్పించాలి.
ఎయిర్ చార్టర్స్ ఇండియా, బ్లేడ్, ఫ్లయింగ్ చార్టర్స్, కంఫర్ట్ మై ట్రావెల్, బద్రి హెలికాప్టర్లు, అక్రిషన్ ఏవియేషన్, ఏఓ హెలికాప్టర్లు, బ్లూహైట్స్ ఏవియేషన్, ఎయిర్ చార్టర్ సర్వీస్ ద్వారా హెలికాప్టర్లను సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు.
ఖర్చు ఎంతంటే..
ఒక రోజు అంతా హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటే ఒక రౌండ్ పర్యటన కోసం రూ.2.6 లక్షల వరకు వ్యయం పెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు ఇంటర్-సిటీ ట్రాన్స్‌పోర్ట్ కోసం ప్రైవేట్ చాపర్‌లలో సీటును రూ.12,000 కంటే తక్కువ ధరకు అందిస్తుంటాయి. కానీ, మతపరమైన ప్రదేశాల్లో ఉన్న వాటి ధర చాలా వరకు తక్కువగానే ఉంటుంది.
ఇవీ చదవండి: World tourism day 2023: టూరిజంలో నంబర్ వన్ అవుదాం.. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో మంత్రి రోజా
MT Krishna Babu: పర్యావరణంతో ముడిపడిన ప్రజారోగ్యం.. వోన్ హెల్త్ కార్యాచరణతో సవాళ్లను ఎదుర్కోవచ్చు..
Bhakti: ఒకరి భక్తిపై మరొకరు జోక్యం చేసుకోవచ్చా? భక్తి మార్గంలో ఏది సరైంది?
Lord Shiva: మహాశివుడి 19 అవతారాలు తెలుసా? వాటి ప్రాముఖ్యం తప్పక తెలుసుకోండి!
